English | Telugu

Guppedantha Manasu : వసుధార గతం విని కన్నీళ్లు పెట్టుకున్న రంగా.. సరోజకి డౌట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'.ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1113 లో... రిషి గురించి వసుధార అక్కడున్న రంగ, సరోజ వాళ్ళకి చెప్తుంది. ఆయన ఒక కాలేజీకి ఎండీ అంటూ రిషి గురించి గొప్పగా చెప్తుంది. ఒక దుర్మార్గుడి కుట్ర వాళ్ళ అయన నాకు దూరం అయ్యారు. ఆయన కోసం తను ఇచ్చిన బాధ్యతలు కూడా పక్కన పెట్టి వచ్చానని వసుధార చెప్తుంటే రంగాకి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఏంటి బావ కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. కొంపదీసి ఆ రిషి సర్ బావేనా అని సరోజ అనుకుంటుంది. ఇప్పటికైనా ఒప్పకొండి సర్ నా రిషి సర్ అని వసుధార అనగానే.. ఏదో మీరు చెప్తుంటే ఆటోమేటిక్ గా కళ్ళలో నీళ్లు వచ్చాయి. సినిమా స్టోరీలాగా ఉంది. అంత మాత్రాన నేను రిషి సర్ ని అయిపోతానా.. నేను రంగాని అని చెప్పి రంగా వెళ్ళిపోతాడు.

దీని కథ వింటే నాకే జాలి అనిపించింది. అలాంటిది బావని రిషిగా ఈ పది హేనురోజుల్లో మార్చేస్తుందేమోనని సరోజ టెన్షన్ పడుతుంది. నీ కథ వింటే బాధగా ఉంది. ఇంత బాధ మనసులో పెట్టుకొని ఎలా పైకి మాములుగా ఉంటున్నావని పెద్దావిడ అంటుంది. మరొకవైపు ఏంజిల్ ,అనుపమ ఇద్దరు కలుసుకుంటారు. మను గురించి నీకేం తెలుసని అనుపమ అడుగుతుంది. తనకి తన తండ్రి గురించి తప్ప వేటిపై ఇంట్రస్ట్ లేదని ఏంజిల్ చెప్తుంది. అందరు తనని తండ్రి విషయంలో బాధపెట్టేవాళ్లే.. నువ్వు ఆ ఆలోచన రాకుండా చెయ్యాలి. నీకు మను అంటే ఇష్టమా అని అనుపమ అడుగగా‌.. అవునని ఏంజెల్ చెప్తుంది. కానీ తనకే నేను ఇష్టం లేనని ఏంజిల్ అనగానే.. వాడికి కూడా నువ్వు ఇష్టమే.. ఏ విషయం వాడు బయటపెట్టడు. వాడి గురించి నాకు తెలుసు. మను గతం గురించి మర్చిపోయి.. వాడికి కొత్త ప్రపంచాన్ని పరిచయం చెయ్ అని ఏంజిల్ కి అనుపమ చెప్తుంది. ఏంజిల్ కూడా సరే అంటుంది. మరొకవైపు రంగాతో సరోజ సరదాగా మాట్లాడుతుంటుంది. బావ నన్ను పెళ్లి చేసుకో అని అడుగగా.. నేను చేసుకోనని రంగా అంటాడు.

అప్పుడే వసుధార వచ్చి.. అంతలా అడుగుతుంది కదా, తనని పెళ్లి చేసుకోవచ్చు కదా అని వసుధార అంటుంది. అది నా ఇష్టం మేడమ్ అని రంగా అంటాడు. ఎందుకు నిన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడో తెలుసా.. ఎందుకంటే రిషి సర్ కాబట్టి.. అతనికి పెళ్లి అయింది కాబట్టి అని వసుధార అంటుంది. లేదు నా రంగా బావ అని సరోజ అంటుంది. మేడమ్ గురించి తెలుసు కదా తన మాటలు పట్టించుకోకని సరోజకి రంగా చెప్పి వెళ్తాడు. మరొకవైపు ఎండీగా శైలేంద్ర పేరు చెప్పలేదని ఫణీంద్రతో దేవయాని అంటుంది. వాడి చేష్టలతో నా పరువుపోతుంది. అయిన వసుధర వచ్చి శైలేంద్రకి ఎండీ బాధ్యత ఇవ్వండి అని చెప్తేనే ఇస్తారని ఫణీంద్ర అంటాడు. వసుధర అలా ఎప్పటికి చెప్పదు.. కనీసం కాలేజీలో ఏ బ్రాంచ్ లు ఉన్నాయో కూడా శైలేంద్రకి తెలియదు.. తను ఎలా చెప్తుందని ధరణి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.