English | Telugu
Biggboss 8 telugu contestants : బిగ్ బాస్ తెలుగు సీజన్-8 లో కంటెస్టెంట్స్ వీళ్ళే!
Updated : Sep 2, 2024
బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకొని ఎనిమిదవ సీజన్ నిన్న సెప్టెంబర్ 1న రాత్రి ఏడు గంటలకి గ్రాంఢ్ గా లాంచ్ అయింది. ఇక ఈ సీజన్ కంటెస్టెంట్స్ లిస్ట్ చూస్తే ఒక్కొక్కరు ఒక్కో పంథాలో ఉన్నారు. అయితే వీరిలో కొంతమంది ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు అనేలా ఉన్నారు . మరి వారెవరో ఓసారి చూసేద్దాం.
గత సీజన్ లాగే ఈ సీజన్ కి హోస్ట్ నాగార్జునే. ఇక హౌస్ లోకి మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఏడు జోడీలుగా లోపలికి వెళ్ళారు. ఇక హౌస్ లోకి వెళ్ళిన వారికి మూడు బ్యాడ్ న్యూస్ లు కూడా చెప్పేశారు బిగ్ బాస్. నో రేషన్, నో కెప్టెన్సీ, జీరో ప్రైజ్ మనీ అంటు కండిషన్స్ చెప్పేశారు. ఇక ఫన్, ఎంటర్‌టైన్మెంట్ కి లిమిటే లేదు అనే థీమ్ తో మొదలైన బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ సెలెక్షన్ భిన్నంగా ఉంది. మొదటి కంటెస్టెంట్ గా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫేమ్ యష్మీ గౌడ(Yashmi Gowda) లోపలకి వచ్చేసింది. రెండవ కంటెస్టెంట్ గా నిఖిల్(Nikhil) వచ్చాడు. కన్నడ సినిమాల్లో హీరోగా నటించిన నిఖిల్ తెలుగులో కొన్ని సీరియళ్ళలో నటించాడు. మూడవ కంటెస్టెంట్ గా అభయ్ నవీన్(Abhai Naveen) వచ్చాడు. నటుడిగా, దర్శకుడిగా అభయ్ నవీన్ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. పెళ్ళిచూపులు మూవీతో గుర్తింపు తెచ్చుకున్న అభయ్.. తను దర్శకుడిగా రామన్నా యూత్ అనే సినిమాని కూడా తీశాడు. నాల్గవ కంటెస్టెంట్ గా ప్రేరణ కంభం(Prerana Kambam) వచ్చింది. కృష్ణ ముకుంద మురారి సీరియల్ కృష్ణ పాత్రతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. తనకి పెళ్ళి జరిగి ఎనిమిది నెలలే అవుతుంది. అయిదవ కంటెస్టెంట్ గా ఆదిత్య ఓం( Aditya Om) హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 'లాహిరి లాహిరి లాహిరి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన ఆదిత్య ఓం.. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవ్వగా కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.
ఆరవ కంటెస్టెంట్ గా నటి సోనియా(Sonia) హౌస్ లోకి అడుగుపెట్టింది. ఆర్జీవీ స్పెషల్ విషెస్ చెప్పడంతో ఈ భామ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది. ఏడవ కంటెస్టెంట్ గా బెజవాడ బేబక్క(Bezawada Bebakka )ఎంట్రీ ఇచ్చింది. యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో ఫన్ వీడియోలు, మిమిక్రీ, సింగింగ్, యాంకరింగ్.. ఇలా మల్టీ ట్యాలెంటెడ్ గా ఉన్న బెజవాడ బేబక్క.. హౌస్ లో ఫుడ్ అన్ లిమిటెడ్ గా కావాలని అంది. ఎనిమిదవ కంటెస్టెంట్ గా శేఖర్ బాషా ( Shekar Basha) ఎంట్రీ ఇచ్చాడు. ఆర్జేగా ఎన్నో సంవత్సరాలు చేసిన శేఖర్.. తాజాగా రాజ్ తరుణ్-లావణ్యల మధ్య జరిగిన గొడవలో దూరి వైరల్ అయ్యాడు.
తొమ్మిదవ కంటెస్టెంట్ గా కిర్రాక్ సీత(Kirrak seetha) ఎంట్రీ ఇచ్చింది. 'బేబి' సినిమాలో నెగెటివ్ రోల్ లో కన్పించిన తనని తనని చాలామంది ట్రోల్ చేశారంట. తను ఆ పాత్ర చేశాను..కానీ అలా నేనుండను అంటూ ఎమోషనల్ అయ్యింది. పదవ కంటెస్టెంట్ గా నాగ మణికంఠ(Naga Manikanta) హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా, పదకొండో కంటెస్టెంట్ గా పృథ్వీరాజ్(Prithviraj )ఎంట్రీ ఇచ్చాడు. ఇక పన్నెండో కంటెస్టెంట్ గా విష్ణుప్రియ వచ్చేసింది. పదమూడవ కంటెస్టెంట్ గా నైనిక( Nainika) ఎంట్రీ ఇవ్వగా, పద్నాలుగో కంటెస్టెంట్ గా నబీల్ ఆఫ్రిదీ ఎంట్రీ ఇచ్చాడు. వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న ఈ ఆఫ్రిద హౌస్ లో ఎలా ఉంటాడో ఎమో చూడాలి మరి.