English | Telugu

బిబి కాయిన్స్ వేటలో కంటెస్టెంట్స్ దూకుడు.. గేమ్ ఛేంజర్ గా టేస్టీ తేజ!

బిగ్ బాస్ సీజన్-7 లో రోజు రోజుకి అంచనాలు తారుమారు అవుతున్నాయి. నిన్నటి దాకా నామినేషన్ల హీటెడ్ ఆర్గుమెంట్ లు టాక్ ఆఫ్ ది హౌజ్ గా ఉన్నాయి. నిన్నటి బుధవారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ గేమ్ లోకి వచ్చేశారు.

ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకొని ఆట సందీప్, శివాజీ, శోభా శెట్టి ముగ్గురు హౌజ్ మేట్స్ గా కన్ఫమ్ అయ్యారు. ఇక నాల్గవ వారం పోటీ కోసం బిగ్‌బాస్ బిబి‌ కాయిన్స్ తో టాస్ మొదలుపెట్టాడు. హౌజ్ లో ఎవరి దగ్గర ఎక్కువ బిబి కాయిన్స్ ఉంటాయో వారికి నాల్గవ కంటెస్టెంట్ కోసం తర్వాతి లెవెల్ కి వెళ్ళడానికి అర్హులని బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత శోభా శెట్టి, శివాజీ, ఆట సందీప్ కి కొన్ని బిబి కాయిన్స్ ఇచ్చాడు. అయితే అవి కంటెస్టెంట్స్ రిక్వెస్ట్ చేసుకొని తీసుకోవాలని కోరగా.. ఒక్కో కంటెస్టెంట్ ముగ్గురి దగ్గరికి వెళ్ళి వారిను రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇక ఫస్డ్ టాస్క్ ముగిసే సరికి యావర్ లీడ్ లో ఉండగా తర్వాత స్థానంలో అమర్ దీప్ ఉన్నాడు.

కంటెస్టెంట్స్ లో ఎవరైతే ముందు వెళ్ళి బిబి ఏటీఎమ్ బజర్ ప్రెస్ చేస్తారో వారికే నాల్గవ కంటెస్టెంట్ ఆడటానికి అర్జులని, వారు మరొక కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత వారికి ప్రత్యర్థులను ఎన్నుకునే హక్కు కూడా బిగ్ బాస్ ఇచ్చాడు. అయితే అమర్ దీప్ ఫస్ట్ బజర్ ప్రెస్ చేసినట్టుగా శోభాశెట్టి, ఆట సందీప్, శివాజీ చెప్పారు. ఇక అమర్ దీప్ తనకి సపోర్ట్ గా గౌతమ్ కృష్ణని తీసుకున్నాడు. వారికి ప్రత్యర్థులుగా రతిక, టేస్టీ తేజలని సెలెక్ట్ చేసుకున్నాడు అమర్ దీప్. టాస్క్ ఏంటంటే.. యాక్టివిటీ ఏరియాలో ఇసుక పోసి ఉంటుంది. ఆ ఇసుకని దాటి వెళ్ళి పసుపు రంగు గల స్కేర్ లో నిల్చొని ఫోటోకి ఫోజు ఇవ్వాలి. అది స్మైలీ. దాన్ని ఫోటోగ్రాఫర్ ని నిర్వహిస్తున్న శివాజీ క్యాప్చర్ చేస్తాడు. వీలైనన్ని ఎక్కువ స్మైలీ ఫోటోలని నవ్వుతూ దిగాలి. ఇందులో గౌతమ్ కృష్ణ, అమర్ దీప్ గెలిచారు. టేస్టీ తేజ, రతిక ఓడిపోవడంతో వారి దగ్గరున్న కాయిన్స్ అన్నీ అమర్ దీప్, గౌతమ్ కృష్ణల సొంతమయ్యాయి. ఈ టాస్క్ కి సంచాలకుడిగా శివాజీ ఉన్నాడు.