English | Telugu

రాహుల్ ది యాక్టింగ్ అని కనిపెట్టేసిన కావ్య.. స్వప్నకి ప్రమాదం పొంచి ఉందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -212 లో.. రాహుల్ ప్లాన్ లో భాగంగా స్వప్నకి రింగ్ గిఫ్ట్ ఇస్తున్నానంటూ ప్రేమగా మాట్లాడతాడు. అప్పుడే స్వప్న వెనకాల నుండి మైఖేల్ వచ్చి స్వప్న తలకి గన్ పెడతాడు. మైఖేల్ వచ్చిన వాళ్ళు రాహుల్ తలపై కొడతారు. దాంతో రాహుల్ కిందపడిపోయినట్లు నటిస్తాడు. స్వప్నని మైఖేల్ కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత రాహుల్ లేచి.. ఇప్పుడు కదా అసలైన కథ మొదలైందని అనుకుంటాడు.

మరొకవైపు కావ్య బట్టలు ఐరన్ చేస్తుండగా.. అందులో రాజ్ షర్ట్ బటన్ ఊడిపోతుంది. అది తెలియకుండా రాజ్ షర్ట్ వేసుకుంటాడు. ఊడిపోయింది చూసిన కావ్య షర్ట్ వేసుకున్నాక బటన్ కుడుతుండగా.. రాజ్ ఇబ్బంది పడతాడు. మరొక వైపు రాజ్, కావ్య ఇద్దరు సంతోషంగా ఉండడం చూసిన ఇందిరాదేవి సంతోషపడుతు సీతారామయ్యకు చెప్తుంది. కావ్యని సంతోషంగా చూసుకుంటానని రాజ్ నాకు మాటిచ్చాడని ఇందిరాదేవీతో సీతరామయ్య చెప్తాడు. ఆ తర్వాత రాజ్ టిఫిన్ చెయ్యడానికి రెడీ అయి వస్తాడు. హాల్లో కూర్చొని ఉన్న సుభాష్ కి ఎవరో ఫోన్ చేసి రాహుల్ కీ దెబ్బలు తగిలి హాస్పిటల్ లో ఉన్నాడని చెప్పగానే అందరు కంగారు పడతారు.. రుద్రాణికి ప్లాన్ ముందే తెలుసు కానీ తన నటన మొదలుపెడుతుంది. రుద్రాణి, కావ్య,సుభాష్, రాజ్ లు హాస్పిటల్ కి వెళ్తారు. మరొక వైపు స్వప్నని కిడ్నాప్ చేసిన మైఖేల్ తనని ఒక రూమ్ లో బంధిస్తాడు. నా రాహుల్ మిమ్మల్ని వదిలిపెట్టడంటూ స్వప్న అంటుంది. ఒక్క దెబ్బకే పడిపోయిన వాడు నన్నేం చేస్తాడు. నన్ను పెళ్లి చేసుకోమని స్వప్నతో మైఖేల్ చెప్తాడు.

మరొక వైపు రాహుల్ అక్కడున్న నర్సుతో ఫ్లర్టింగ్ మొదలుపెడతాడు. ఆ తర్వాత ఎవరో వచ్చి మీ వాళ్ళు వస్తున్నారని చెప్పగానే.. రాహుల్ బెడ్ మీద పడుకొని స్పృహ లేనట్టు నటిస్తాడు. ఆ తర్వాత రాహుల్ ని అలా చుసిన రుద్రాణి.. ఏమైంది అంటూ నటిస్తుంది. ఆ తర్వాత రాహుల్ ఏర్పాటు చేసిన డాక్టర్ వచ్చి.. దెబ్బలు బాగా తగిలాయని చెప్తాడు. అప్పుడే నర్సు వచ్చి పేషెంట్ స్పృహ లోకి వచ్చాడని చెప్పగానే అందరూ లోపలికి వెళ్తారు. రాహుల్ నటిస్తూ.. కొందరు రౌడీలు నన్ను కొట్టి స్వప్నని తీసుకొని వెళ్లారని చెప్పగానే కావ్య టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత కావ్య.. మీరు ఊటీకి వెళ్లారు కదా అంటూ అన్ని అడిగేసరికి వచ్చాము. స్వప్న కీ సర్ ప్రైజ్ అని రింగ్ ఇవ్వడానికి ప్లాన్ చేసాను. ఇలా జరిగిందంటూ రాహుల్ చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ కావ్య అడిగే ప్రశ్నలకి రాహుల్ తడబడతాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.