English | Telugu

రవికాంత్‌పై క్రష్ ఉంది... స్వాతి పెళ్ళి చూపులు!

సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఈ వారం "మంత్ ఆఫ్ మధు" మూవీ టీమ్ ఎంట్రీ ఇచ్చింది. నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి వచ్చారు. రాగానే సుమ "నవీన్ చంద్రా ఎలా ఉన్నారు" అని సుమా అడిగేసరికి "తానెప్పుడూ జంటిల్మెన్నే" అని స్వాతి ఆన్సర్ ఇచ్చింది దానికి సుమ కౌంటర్ వేసి స్వాతిని ఇరికించింది. "నవీన్ జెంటిల్ మ్యాన్ ఐతే మన హీరో నాన్ని ఏమిటి" అనేసరికి స్వాతి షాకైపోయింది. తర్వాత ఒక గేమ్ ఆడించింది. అందులో "శీతాకాలం అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి" అని అడిగింది సుమ "దుప్పట్లు" అని చెప్పింది స్వాతి. ఐతే ఆ ఆన్సర్ రాంగ్ అయ్యేసరికి "దుప్పట్లు అనగానే అన్నీ వచ్చేస్తాయేమో అనుకున్నా" అంది స్వాతి ..దానికి సుమ "దుప్పట్లోకి అన్నీ రావు ఒకరిద్దరి వస్తారు" అని చెప్పింది సుమ. దానికి స్వాతి షాకైపోయింది.

తర్వాత పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తుంది సుమ.."సుబ్బారావు పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి..అతన్నే చేసుకుంటా" అని స్వాతి మొండి పట్టు పడుతుంది..దానికి సుమ "నేనెక్కడి నుంచి సుబ్బారావును తీసుకురాను" అంటుంది. ఆ తర్వాత షోలోకి రవికాంత్ వచ్చాడు. నవీన్ చంద్ర, రవికాంత్, మధు అలియాస్ స్వాతి ముగ్గురూ ఒక టీమ్ గా కనిపించేసరికి "ఇది మంత్ ఆఫ్ మధు ఫామిలీనా, బేబీ ఫామిలీనా" అర్ధం కావడం లేదు అని సుమ అనేసరికి "పాత కాలంలో తాతయ్యలకు ఇద్దరు అమ్మమ్మలు ఉండేవాళ్ళు కదా..నాకు ఇద్దరు తాతయ్యలు ఉన్నారు" అని స్వాతి కామెడీగా చెప్పేసరికి సుమ నవ్వేసింది. ఫైనల్ గా స్వాతి ఒక ట్విస్ట్ ఇచ్చింది "ఈటీవీలో అఫీషియల్ గా చెప్తోంది ఏంటంటే నాకు రవికాంత్ మీద క్రష్ ఉంది" అని చెప్పింది స్వాతి. దానికి రవికాంత్ తెగ సిగ్గుపడిపోయాడు.