English | Telugu

Bigg Boss 9 Telugu: డబుల్ ఎలిమినేషన్ లో సూపర్ ట్విస్ట్.. అసలేం జరిగిందంటే!

బిగ్ బాస్ సీజన్-9 లో అయిదో వారం డబుల్ ఎలిమినేషన్ తో డబుల్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. నిన్నటి సండే ఎపిసోడ్ లో నామినేషన్లో ఉన్నవారిని సేవ్ చేస్తూ వచ్చిన నాగ్ మామ.. రీతూ చౌదరి, ఫ్లోరా సైనాని చివరి దాకా ఉంచి చివరికి ఫ్లోరా సైనిని ఎలిమినేట్ చేశారు.

ఇక ఫ్లోరా ఎలిమినేషన్ తర్వాత తను స్జేజ్ మీదకి వచ్చింది. ఆ తర్వాత తన జర్నీ వీడియోని చూపించాడు నాగార్జున. ఇక హౌస్ లో కొంతమందికి థమ్స్ అప్, థమ్స్ డౌన్ ఇవ్వమని నాగార్జున అడుగగా తను ఇచ్చింది. సంజన, దివ్య. ఇమ్మాన్యుయల్ , శ్రీజలకి థమ్స్ అప్ ఇవ్వగా.. భరణి, తనూజలకి థమ్స్ డౌన్ ఇచ్చింది. ఇక సుమన్ శెట్టిని మాత్రం అటు ఇటు కాకుండా మధ్యలో పెట్టేసి వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత వరుసగా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చారు. ‌ఇక హౌస్ లో నామినేషన్లో ఉన్నవారికి మరో టాస్క్ ఇచ్చాడు. వారిలో నుండి సుమన్ శెట్టి, డీమాన్ పవన్, శ్రీజ మిగులుతారు. వారికి మరో టాస్క్ ఇవ్వగా అందులో నుండి సుమన్ శెట్టి ఎలిమినేషన్ అవుతాడు. ఇక డీమాన్, శ్రీజలకి మరో టాస్క్ ఇవ్వగా అందులో డీమాన్ సేవ్ అవుతాడు. ఇక చివరి రౌండ్ లో శ్రీజ, సుమన్ శెట్టి ఎలిమినేషన్ కి ఒక్క అడుగు దూరంలో ఉంటారు.

వైల్డ్ కార్డ్స్ కి అవకాశం ఇస్తాడు బిగ్ బాస్. సుమన్ శెట్టి, శ్రీజలలో ఎవరు ఈ హౌస్ లో ఉండడానికి అర్హులు కారో వారి దగ్గరున్న బెలూన్ ని తీసివేయండి అని నాగార్జున చెప్తాడు. దాంతో మెజారిటీ వైల్డ్ కార్డ్స్ శ్రీజ బెలూన్స్ తీసేస్తారు. దాంతో శ్రీజ ఎలిమినేషన్ అని నాగార్జున ప్రకటిస్తాడు. ఇక స్టేజ్ మీదకి వచ్చాక తన జర్నీ వీడియో లేదని ప్లే చేయడు. ఎందుకంటే అనుకోకుండా జరిగింది కదా అని నాగార్జున అంటాడు. ఇక హౌస్ లోని వారి గురించి నాగార్జున అడిగాడు. డీమాన్‌కి ఫ్రెండ్, భరణికి ఎనిమీ, కళ్యాణ్‌కి ట్రస్ట్, సంజనకి రియల్, సుమన్‌కి వీక్, దివ్యకి ఫేక్, ఇమ్మూకి స్ట్రాంగ్, రీతూ, తనూజ, రాములకి గుడ్ అనే ఆప్షన్ ఇచ్చింది శ్రీజ. ఇక తనకి ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించేశాడు నాగార్జున. హౌస్ లోనుండి నిన్నటి ఎపిసోడ్ లో ఫ్లోరా సైనీ, శ్రీజ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు.