English | Telugu

భోలే హీరో, అశ్వినిశ్రీ హీరోయిన్.. ఇక కొత్త సినిమా మొదలయ్యేనా!


భోలే అంటే హీరో.. కష్ట సమయంలో ప్రశాంత్ పక్కన నిల్చున్నాడు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ గెలుచుకున్న ప్రశాంత్ ని.. ట్రాఫిక్ వాయిలెన్స్ వల్ల పోలీసులు అరెస్ట్ చేసి జైలులో పెట్టగా అతనికి బెయిల్ వచ్చేలా చేసి అండగా ఉన్నాడు భోలే. ఇక ఇప్పుడు భోలే నిజంగానే హీరో అయ్యాడు.

కిక్ సినిమాలో పాటతో సినిమా లవర్స్ కి చేరువయ్యాడు భోలే. లవ్ ఫెయిల్యూర్ పాటలతో, కష్టపడ్డా.. పాలమ్మిన, పూలమ్మిన అనే పాటతో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. తాజాగా శుభశ్రీ రాయగురుతో కలిసి చేసిన ఓ ప్రైవేట్ పాట ట్రెండింగ్ లో ఉంది‌. బిగ్ బాస్ హౌస్ లో భోలే, అశ్విని కలిసి మంచి ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చారు. అశ్విని శ్రీ తెలుగమ్మాయి. 1989 జూలై 12 న అశ్విని శ్రీ జన్మించింది. ఈమె హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. అయితే మొదటగా తను షార్ట్ ఫిల్మ్ లలో నటించింది. వాటితో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో సినిమాల్లోకి వచ్చింది. 2016 లో వెండితెరపై అరంగేట్రం చేసింది అశ్విని. సంపూర్ణేశ్ బాబు హీరోగా చేసిన "వినోదం 100 పర్సెంట్" అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. ఆ తర్వాత 2017 లో వచ్చిన "అమీర్ పేటలో", 2018 లో వచ్చిన " బిటెక్ బాబులు" , 2020 లో " నువ్వు నేను, ఒసేయ్ ఒరేయ్" వంటి సినిమాలల్లో నటించింది అశ్విని‌.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అశ్వినిశ్రీతో కలిసి ఎక్కువగా ఉన్న భోలే .. బయటకొచ్చాక శుభశ్రీతో కలిసి పాట చేయడంతో ఆ పాట కింద అందరు.. మీ హీరోయిన్ తో ఓ పాటని చేయొచ్చు కదా హీరో అంటు కామెంట్లు చేసారు. ఇక అదే విషయం గురించి వివరిస్తూ అశ్వినిశ్రీ ఓ వ్లాగ్ ని చేసింది. త్వరలో మా కాంబినేషన్ లో ఓ పాట వస్తుందంటు భోలే షావలి, అశ్వినిశ్రీ ఈ వ్లాగ్ లో చెప్పుకొచ్చారు. ' భోలేతో బోలెడన్ని కబుర్లు' అంటూ చేసిన ఈ వ్లాగ్ లో చాలా విషయాలని షేర్ చేసారు. హౌస్ లో వారిమధ్య ఉన్న బాండింగ్ ని గుర్తుచేసుకున్నారు. భోలే అయితే తను అందంగా ఉంటాడని చెప్పగా అశ్వినిశ్రీ నవ్వుకుంది. ఇక రోజుకి రెండు లీటర్లు నీళ్ళు తాగాలని , అది మనలోని అన్ వాంటెడ్ కొవ్వుని తీసేస్తుందని , బాడీలోని టాయిలెట్ ని ఫ్లష్ చేయడంలో వాటర్ అనేది యూజ్ అవుతుందని భోలే చెప్పాడు. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏమైనా చేయగలమంటూ హెల్త్ టిప్ ని ఇచ్చాడు భోలే. ఇక అశ్వినిశ్రీని హీరోయిన్ అంటు భోలే అనగా త్వరలోనే మనం ఓ పాటని చేద్దామంటూ అశ్విని అంది. నువ్వు హీరోయిన్, నేను హీరో మనమిద్దరం కలిసి త్వరలోనే ఓ సినిమానే చేద్దామని భోలే షావలి అనగా అశ్వినిశ్రీ నవ్వుకుంది. ఇలా సరదాగా సాగిన ఈ వీడియోకి భోలే ఫ్యాన్స్, అశ్వినిశ్రీ ఫ్యాన్స్ కలిసి తెగ కామెంట్లు చేస్తున్నారు.‌ దాంతో ప్రస్తుతం ఈ వీడియో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.


Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.