English | Telugu

ట్యాలెంట్ చూపిస్తున్న బిగ్ బాస్ అశ్వినిశ్రీ!


అశ్వినిశ్రీ ఇప్పుడు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న బ్యూటీ. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో 2.0 లో అడుగుపెట్టి గ్లామర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ గేమ్ పై తక్కువ ఫోకస్ చేస్తూ ఎలాగోలా చివరివరకు నెట్టుకొచ్చింది. అశ్వినిశ్రీ బిగ్ బాస్ లో సింపతి ప్లే చేసి చాలా రోజులే హౌస్ లో ఉంది.

అశ్విని పుట్టి, పెరిగిందంతా హైదరాబాద్ లోనే.. ఇంజినీరింగ్ చదివి తండ్రికి ఇష్టం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ భామ. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఫేమస్ అయింది. అయితే చిన్న చిన్న సినిమాలలో నటించి తన కెరీర్ ని మొదలు పెట్టింది. అయిన అంత గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ లోకి ఎంట్రీ తర్వాత అశ్వినీకి ఒక్కసారిగా స్టార్ డమ్ వచ్చిందని అనడంలో ఆశ్చర్యమే లేదు. బిగ్ బాస్ సీజన్ పూర్తైన తర్వాత ఫ్రెండ్స్ మీట్ అంటూ తన తోటి కంటెస్టెంట్స్ ని కలవడం వారితో కలిసి వీడియోలు, రీల్స్ చేస్తూ బిజీగా ఉంటు వస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో భోలే షావలితో మంచి రాపో ఏర్పరుచుకున్న అశ్వినిశ్రీ.. ఒక నామినేషన్ లో ఆయనేమైనా హీరోనా నేను ఆయన హీరోయిన్ అనడానికి అని అశ్విని అనగా.‌. సారీ నువ్వు అలా అనకు అశ్విని.. నేను హీరోనే అంటు భోలే చెప్పడంతో ఆ నామినేషన్ ఫుల్ కామెడీ అయింది. ఆ తర్వాత ప్రియాంక, శోభాశెట్టిలతో నామినేషన్ లో పెట్టుకున్న గొడవలు ఎలా ఉండేవంటే.. బోరింగ్ దగ్గర నీళ్ళ కోసం ఆడాళ్ళు కొట్టుకునేట్టుగా ఉండేవని అప్పట్లో తెగ ట్రోల్స్ వచ్చాయి.

బిగ్ బాస్ తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ని మొదలిపెట్టిన అశ్వినిశ్రీ.. క్రిస్మస్ కి వ్లాగ్ చేసి అందరికి మరింత దగ్గరైంది. ఇక తన ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా రీల్స్ చేస్తూ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే ఈ భామని తన ఫ్యాన్స్ ముద్దుగా అరేబియన్ గుర్రమని అంటారు. అయితే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోని పోస్ట్ చేసింది అశ్వినిశ్రీ. ఐ లవ్ డ్రైవింగ్ అంటూ కాప్షన్ తో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. అయితే ఈ వీడియోలో తన డ్రైవింగ్ ని కాకుండా తన హొయలని చూపిస్తు కన్పించింది ఈ భామ. అరేబియన్ గుర్రం కార్ డ్రైవ్ చేస్తుంది.. ఏంటి కార్ చూపిస్తున్నావా, ట్యాలెంట్ చూపిస్తున్నావా అంటు నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ వీడియో ఫుల్ వైరల్ గా మారింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.