English | Telugu

మేం బక్కోళ్ళం బ్రో..లావవ్వడం మాకు అసలు పాజిబుల్ కాదు

జోర్దార్ సుజాత బక్కగా ఉంటుంది కానీ మంచి బలంగా ఉంటుంది. ఐతే సుజాత తనకు ఒక స్పెషల్ టాలెంట్ ఉంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటోంది. ఇంతకు ఆ టాలెంట్ ఏంటబ్బా అని చూస్తీ ఇది... ఆమె బలం, ఆమె టాలెంట్ ఆమె చేసే స్కిట్స్ లో కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి సుజాత రాకేష్ తో అన్ని ఈవెంట్స్ లో పార్టిసిపేట్..ఐతే పెళ్ళికి ముందు సుజాత ఎలా ఉందొ పెళ్లయ్యాక కూడా సుజాత అలాగే ఉంది. కొంచెం కూడా బాడీ రాలేదు. స్లిమ్ గా ట్రిమ్ గా అలానే ఉంది.

ఐతే చాలామందికి పెళ్లయ్యాక లావైపోతూ వచ్చిన బాడీని తగ్గించుకోలేక అవస్థలు పడుతూ ఉంటారు. ఐతే సుజాత ఈ విషయంలో చాలా గొప్పగా ఫీలవుతోంది. దాని మీద ఒక వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "మేం బక్కోళ్ళం బ్రో..లావవ్వడం మాకు అసలు పాజిబుల్ కానీ కాదు..ఎంత తిన్నాసరే చెప్తున్నాగా ఎంత తిన్నా సరే వంద గ్రాముల వెయిట్ కూడా పెరగం..అదిదా మా స్పెషల్ టాలెంట్" అంటూ తానూ వేసుకున్న డ్రెస్ లో తానెంత సన్నగా ఉందో చూపించింది సుజాత.

ఇక నెటిజన్స్ ఐతే "అంతే ఆంటీ..మరి లావుగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి" అని అడుగుతున్నారు. కమెడియన్ రాకింగ్‌ రాకేశ్ తో, జోర్దార్‌ సుజాత ప్రేమ లవ్ స్టోరీ సోష‌ల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. సుజాత బిగ్ బాస్ షోకి వెళ్లి వచ్చింది. వీరిద్దరి లవ్‌ రీల్‌ లైఫ్‌లోనే కాదు, రియల్‌ లైఫ్‌లోనూ రొమాన్స్ పండిస్తోంది. ఈ ఇద్దరూ టీవీ షోస్ లో ఎన్నో సార్లు ప్రొపోజ్ చేసుకున్నారు. ఇక చివరికి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. "సేవ్ ది టైగర్స్" వెబ్ సిరీస్ లో జోర్దార్ సుజాత నటన పీక్స్ ఉంటుంది. తెలంగాణ యాసతో చెప్పే డైలాగ్స్ కి ఆడియన్స్ పడీపడీ నవ్వుకున్నారు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.