English | Telugu
పెళ్లి కూతురికి ప్రదీప్ బిస్కెట్... కన్నీళ్లు పెట్టుకున్న బాబూమోహన్!
Updated : Aug 10, 2023
డ్రామా జూనియర్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో మంచి కలర్ ఫుల్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి శ్రీదేవి, జయప్రద, బాబుమోహన్ జడ్జెస్ గా ఉన్నారు. ఐతే ఈ వారం జడ్జెస్ విషయంలో ప్రదీప్ కి శ్రీదేవికి మధ్య చిన్న డిస్కషన్ సీరియస్ గా మొదలయ్యింది. చివరికి కూల్ ఐపోయింది. "ఇందాకటి నుంచి వీళ్ళే జడ్జెస్ వీళ్ళే జడ్జెస్ అని నన్ను ఫోర్స్ చేస్తున్నారు" అని ప్రదీప్ అనేసరికి "అంటే మీరు డిసైడ్ ఇపోయారా వాళ్ళే జడ్జెస్ మేము పార్టిసిపెంట్స్ అని" శ్రీదేవి అనేసరికి " దేవతలు కూడా అనుకున్నారు" అని ప్రదీప్ బిస్కెట్ వేసాడు. ఇక శ్రీదేవి ఐస్ ఐపోయింది. దాంతో జయప్రద ముఖం మాడిపోయింది. "అయ్యో మేడం మీరు అలిగారా..యాక్చువల్లీ నేను మేడం కోసం రోజా పువ్వు తెద్దామనుకున్నా..కానీ మేడమే రోజా పువ్వులా ఉంటే ఇంకా రోజా ఎందుకని తేలేదు" అని అనేసరికి జయప్రద నవ్వేశారు.
"ఇదిగో నీకోసం అంటూ శ్రీదేవి ప్రదీప్ కి బిస్కెట్ ఇచ్చింది..ఎవరికీ లేదు నాకే " అని దాచుకున్నాడు ప్రదీప్.. "దాచిపెట్టావంటే కచ్చితంగా పెళ్లి కూతురు కోసమే" అంటూ పంచ్ వేశారు బాబూమోహన్. ఇక ఈ ప్రోమో లాస్ట్ లో రవి, సుష్మ కిరణ్ చిన్నారులతో కలిసి చేసిన స్కిట్ కి బాబుమోహన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. "నాకు మా అమ్మ గుర్తొచ్చింది. 3 వ తరగతిలో మా అమ్మ చనిపోయింది. నాకు చిన్న చెల్లెలు ఉంది. ఆమెకు చిన్నప్పటి నుంచి తల దువ్వి, జడ వేసేవాడిని..మా నాన్న ఎటో వెళ్ళిపోయాడు. మేము మా బాధను ఎవరికీ చెప్పుకోవాలో తెలియదు" అని చెప్తుండగా ఈ ప్రోమో ఎండ్ అయ్యింది. డ్రామా జూనియర్స్ లో ప్రతీ వారం చిన్నపిల్లలు చేసే స్కిట్స్ మంచి హైలైట్ గా నిలుస్తున్నాయి. వాళ్ళ ఎమోషన్స్ కానీ, వాళ్ళ డైలాగ్ డెలివరీ కానీ చాలా అద్భుతంగా అలరిస్తున్నాయి. జడ్జెస్ కూడా ఈ చిన్నారుల స్కిట్స్ ని తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళతో పాటు బుల్లితెర నటీనటులు కూడా వచ్చి స్కిట్స్ వేయడం ఇంకా మంచి విషయం.