English | Telugu

గుండెల్ని హత్తుకునేలా ఆదిరెడ్డి చెల్లి నాగలక్ష్మి మాటలు!

బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క. నిన్న మొన్నటి దాకా గొడవలతో సాగిన షో కాస్త ఎమోషనల్ గా మారింది. కాగా బిగ్ బాస్ లో ప్రతి శనివారం నాగార్జున వచ్చి హౌస్ మేట్స్ చేసిన తప్పులు చెప్తూ, వాటికి పనిష్మెంట్ ఇస్తుంటాడు అనే విషయం తెలిసినదే. కానీ ఇప్పుడు అవేవి లేకుండా హౌస్ మేట్స్ సన్నిహితులు, ఇంకా గత సీజన్లలో కంటెస్టెంట్స్ గా ఉన్న సెలబ్రిటీలను కలిపి తీసుకొచ్చాడు బిగ్ బాస్.

అయితే అలా వచ్చినవాళ్ళలో మొదటగా ఇనయాని సపోర్ట్ చేస్తూ సోహెల్, ఇనయా బ్రదర్ వచ్చారు. అలాగే శ్రీహాన్ కి సపోర్ట్ గా ఫాదర్ అమీర్ సాప్, బిగ్ బాస్ సీజన్-1 విజేత శివ బాలాజీ వచ్చారు. ఆ తర్వాత ఫైమాని సపోర్ట్ చేస్తూ బుల్లెట్ భాస్కర్ రాగా, ఇంకా ఫైమా వాళ్ళ సిస్టర్ సల్మా వచ్చింది. రేవంత్ కి సపోర్ట్ గా రేవంత్ బ్రదర్ సంతోష్, రోల్డ్ రైడా వచ్చారు. అలాగే రోహిత్ కి సపోర్ట్ గా ప్రభాకర్ రాగా, ఇంకా రోహిత్ వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు. ఆదిరెడ్డికి సపోర్ట్ గా తన చెల్లెలు నాగలక్ష్మి రాగా, ఇంకా గత సీజన్ కంటెస్టెంట్ లహరి షారి వచ్చింది. అలాగే రాజ్ కి సపోర్ట్ గా తన స్నేహితులు రాగా, శ్రీసత్యకి సపోర్ట్ గా తన స్నేహితులు వచ్చారు. కీర్తీకి సపోర్ట్ గా సీరియల్ యాక్టర్ ప్రియాంక, ఇంకా గత సీజన్ కంటెస్టెంట్ విథిక వచ్చింది.

నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఆదిరెడ్డి చెల్లి నాగలక్ష్మి స్టేజ్ మీదకి వచ్చింది. "అన్న నువ్వు కనిపించట్లేదు.. ఇన్ని రోజులు మా పక్కనే ఉండేవాడివి.‌. ఇప్పుడు లేవు" అని ఏడ్చేసింది నాగలక్ష్మి. ఆ తర్వాత నాగార్జున ఓదార్చాడు. "కామన్ మ్యాన్ రివ్యూయర్ అయ్యాడు. రివ్యూయర్ కంటెస్టెంట్ అయ్యాడు. కంటెస్టెంట్ విన్నర్ అవ్వాలి అన్నా" అని చెప్పి ఆదిరెడ్డికి మంచి కాన్ఫిడెన్స్ ని ఇచ్చింది. కాగా ఇప్పుడు ఈ మాటలు గుండెల్ని హత్తుకునేలా ఉన్నాయంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ప్రేక్షకులు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.