English | Telugu

కొత్తింట్లోకి ఉదయభాను..పిల్లల స్కూల్ కి దగ్గరలోకి షిఫ్ట్


ఉదయభాను ఒకప్పటి టాప్ యాంకర్స్ లో ఒకరు. సోషల్ మీడియా లేని రోజుల్లోనే బుల్లితెరను ఏలిన యాంకర్స్ లో ఉదయభాను చాలా స్పెషల్. ఉదయభాను యాంకరింగ్ చేసిన షోస్ ‘సాహసం చేయరా డింభకా’, ఒన్స్ మోర్ ప్లీజ్, జాణవులే నెరజాణవులే అత్యంత ప్రేక్షకాదరణ పొందాయి. బుల్లితెర శ్రీదేవి అని ఆడియన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. తర్వాత కొంతకాలానికి పెళ్లి చేసుకుని బుల్లితెరకి దూరమయ్యింది. మ్యారేజ్ లైఫ్ లో సెటిల్ ఐపోయింది. ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చి ఇంటి పనుల్లో బిజీ ఐపోయింది. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతుండడంతో టీవీ షోస్ లో మళ్ళీ కనిపించడం స్టార్ట్ చేసింది ఉదయభాను. అలాగే సోషల్ మీడియాలో ఇప్పుడిప్పుడే పేరు సంపాదించుకోవడానికి ట్రై చేస్తోంది.

ప్రెజంట్ ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది అందులోఇంటరెస్టింగ్ వీడియోస్ ని అప్ లోడ్ చేస్తూ ఉంటుంది. లేటెస్ట్ గా తన హోమ్ టూర్ వీడియోని పోస్ట్ చేసింది. ఇంటి పనులు ఇంకా పూర్తి కాకపోయేసరికి సింపుల్ గా భర్త పిల్లలతో కలిసి గృహప్రవేశం చేసేసింది ఉదయభాను. తర్వాత ఇంట్లో పాలు పొంగించారు. ఇంకొద్ది రోజులలో ఇంటి పనులు పూర్తవుతాయని అప్పుడు పూర్తి వీడియో షేర్ చేస్తానని చెప్పింది. ఇప్పుడు తన హోమ్ టూర్లో గెస్ట్ రూమ్, కిడ్స్ రూమ్, వారు చదువుకోవడానికి ఏర్పాటు చేసిన రూమ్, హోమ్ థియేటర్, బాల్కనీ ,టెర్రస్, కథక్ నేర్పిస్తే బాగుంటుంది అంటూ ఒక రూమ్ ని చూపించింది. గతంలో హైటెక్ సిటీలో ఉండేవాళ్లమని ఐతే పిల్లలు స్కూల్ కి వెళ్ళడానికి అటు గంట ఇటు గంట జర్నీకే సరిపోతోంది అని వాళ్ళు స్ట్రైన్ అవుతున్నారంటూ పిల్లల స్కూల్ కి దగ్గర్లో ఈ కొత్త ఇంటిని నిర్మించుకున్నట్లు చెప్పింది. ఉదయభాను కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే విజయ్ కుమార్ అనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత వీళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళే భూమి ఆరాధ్య, యూవీ నక్షత్ర. ఈ ఇద్దరు పిల్లలు చేసే వీడియోస్ ని కూడా యూట్యూబ్ ఛానల్ లో పెడుతూ ఉంటుంది ఉదయభాను.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.