English | Telugu

సుమ 'స్ట్రెస్ బస్టర్స్' కొత్త సీజన్ కి ఆహ్వానం.. గడువు తేదీ ఎప్పుడంటే!

బుల్లితెర స్టార్ మహిళ సుమ కనకాల‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాటలతో స్టార్ హీరోలని, డైరెక్టర్ లను సైతం మెప్పిస్తూ యాంకరింగ్ లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఎంతమందిలో ఉన్నా.. ఏ స్టేజ్ మీద అయినా తన మాటలతో మెస్మరైజ్ చేస్తూ అనర్గళంగా మాట్లాడుతుంది సుమ. స్పాంటేనియస్‌ కామెడీ పంచ్ లతో ఎప్పుడు ఆకట్టుకునే సుమ.. సోషల్ మీడియాలో కూడా తన ప్రతిభని కనబరుస్తుంది. తన యూట్యూబ్ ఛానెల్ లోను వీడియోలు చేస్తూ బిజీగా ఉంటుంది సుమ.

సుమ కనకాల.. తన యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో కొన్ని టిప్స్ ఇస్తూ వీడియోలు కూడా చేస్తుంది. రీసెంట్ గా మహిళల కోసం ఒక వీడియోని చేసి మహిళలకి విలువైన టిప్స్ ని ఇచ్చింది సుమ. తనకు తోచినదే కాకుండా మహిళలకి ఎలా ఉండాలో కొన్ని కొత్త ఐడియాలని ఇస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది.

తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని చేసింది సుమ. 'స్ట్రెస్ బస్టర్స్' పేరుతో యూట్యూబ్ లో అలరించే సుమ.. మరో కొత్త సీజన్ ని స్టార్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. దాని కోసం 3 నుంచి 6 ఏళ్ల వయసు ఉన్న పిల్లల యొక్క వన్ మినిట్ టాకింగ్ వీడియోని, రెండు ఫోటోలని.. వాటితో పాటుగా కాంటాక్ట్ డీటైల్స్ ని పంపించాలని సుమ చెప్పింది. అందులో తన మెయిల్ ఐడీని ఇచ్చి, దానికి ఆ వీడియోతో పాటు ఫోటోలని పంపిస్తే ఆ షోకి ఎంపిక చేస్తామని చెప్పింది సుమ. ఈ షోలో పాల్గొనాలనుకునేవారు పంపించడానికి మే 7 చివరి తేది అని తెలియజేసింది సుమ. ఒకవైపు సుమ అడ్డా, మరోవైపు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి యాంకరింగ్, ఇంకో వైపు ఈ యూట్యూబ్ ఛానెల్ ..ఇలా ఎప్పుడు బిజీగా ఉండే సుమ మరి ఈ 'స్ట్రెస్ బస్టర్స్' కొత్త సీజన్ తో ఎంతగా అలరిస్తుందో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.