English | Telugu

వాడి కాలర్ పట్టుకొని అడిగింది.. నేరస్తుడు దొరికినట్టేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'(Krishna Mukunda Murari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -360 లో...ముకుందకి కృష్ణ ఉండే దగ్గర నలుగు కార్యక్రమం మొదలుపెడుతుంది. అది చూసిన శకుంతల ఏడుస్తుంటుంది. నువ్వు ఇలా శుభకార్యంలో ఏడవకని భవాని కోప్పడుతుంది. ఇదంతా మీ వల్లే ఏం ఇచ్చి మీ ఋణం తీర్చుకోవాలని ముకుంద అనగానే.. సంవత్సరం లోపు ఒక పండంటి పాపని ఇవ్వమని భవాని అంటుంది.

అ తర్వాత ముకుందకి భవాని నలుగు పెడుతుంది. కాసేపటికి కృష్ణని భవాని నలుగు పెట్టమని చెప్తుంది. మరొకవైపు ప్రసాద్, రేవతి వాళ్ళు కలిసి మురారికి నలుగు పెడుతుంటారు. అప్పుడే మురారికి ఎవరో ఫోన్ చేసి శ్రీధర్ ని హత్య చేసిన వాళ్లలో ఒకడు దొరికాడని చెప్తాడు. దాంతో మురారి వెంటనే భవాని దగ్గరకి వచ్చి ఆ విషయం చెప్పి వెళ్తానని అనగానే.. వద్దు నువ్విప్పుడు బయటకు వెళ్ళాకూడదు. కానిస్టేబుల్ కు చెప్పు అతన్ని తీసుకొని రమ్మని అని మురారికి భవాని చెప్తుంది. అసలు ఈ దేవ్ ఎక్కడకి వెళ్ళాడని దేవ్ కి ముకుంద ఫోన్ చేస్తుంది. నాకే టెన్షన్ గా ఉంది ఇంక టెన్షన్ పెట్టకని ఫోన్ కట్ చేస్తాడు దేవ్. ఆ తర్వాత అందరు హాల్లో వెయిట్ చేస్తుంటారు. ఇంక రావడం లేదు. నేను వెళ్తానని మురారి అనగానే నువ్వు ఎందుకు వెళ్తానని అంటున్నావ్.. అక్కడికి వెళ్లి మళ్ళీ తారుమారు చెయ్యడానికి ప్రయత్నం చేస్తావా అని భవాని అనగానే... మీరు ఎందుకు ఏసీపీ సర్ ని వెళ్లనివ్వడం లేదు. నిజం నిరూపిస్తే ఎక్కడ పెళ్లి ఆగిపోతుందోననే భయం కదా మీకు అని కృష్ణ అనగానే.. కృష్ణపై భవాని కోపంగా మాట్లాడుతుంది.

ఆ తర్వాత కానిస్టేబుల్ రౌడీని తీసుకొని వస్తాడు. రౌడీని మురారి నిజం చెప్పమని కొడతాడు. ఇదంతా చేస్తే పెళ్లి ఆగిపోతుందని మా అన్న చెప్పాడు. మా అన్నకి పెద్దపల్లి ప్రభాకర్ చెప్పాడంట అని ఆ రౌడీ అనగానే అందరు షాక్ అవుతారు. కృష్ణ, మురారి ఇద్దరు అలా చెయ్యడని చెప్పే ప్రయత్నం చేసినా భవాని ఎవరి మాట వినదు. నేను నిజాలు కనుక్కుంటానని మురారి వెళ్ళాబోతుంటే భవాని ఎమోషనల్ గా మాట్లాడి వెళ్లకుండా చేస్తుంది. ఆ తర్వాత కృష్ణని అక్కడ నుండి భవాని పంపిస్తుంది. మరొకవైపు ఆ కానిస్టేబుల్ , రౌడీకీ బయటకు వచ్చాక దేవ్ డబ్బులు ఇస్తాడు. తరువాయి భాగంలో దేవ్ వేలికి ఉన్న ఉంగరాన్ని కృష్ణ చూసి దేవ్ కాలర్ పట్టుకొని వీడే శ్రీధర్ ని హత్య చేసిందని చెప్తుంది. అందరు షాక్ అవుతారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.