English | Telugu
'ఆయన ఎంతో మంచి వ్యక్తి'.. డైరెక్టర్ మృతికి అనసూయ నివాళి
Updated : Nov 20, 2022
తెలుగు ఇండస్ట్రీలో ఒక అమేజింగ్ డైరెక్టర్ మదన్ ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మరణంపై యాంకర్ అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. "నేను జర్నలిస్ట్ గా నటించిన "గాయత్రి" చిత్రానికి ఆయన డైరెక్టర్. సహనం, అర్థం చేసుకునే గుణం ఉన్న మంచి వ్యక్తి ఆయన. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి"... అని అనసూయ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
మదన్ లాస్ట్ మూవీ గాయత్రీ. ఈ మూవీలో అనసూయ కీ రోల్ లో నటించారు. ఇంకా ఈయన గతంలో 'ఆ నలుగురు' చిత్రానికి మదన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. "పెళ్ళైన కొత్తలో, గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, గరం"వంటి చిత్రాలకు డైరెక్టర్ గా, రైటర్ గా పనిచేశారు. ఆయన మృతికి ఇండస్ట్రీ పెద్దలు , అభిమానులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.