English | Telugu

Karthika Deepam2 : కొంపముంచిన దాస్.. నిజం చెప్పి జ్యోత్స్నని రోడ్డున పడేస్తాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -565 లో.. సుమిత్ర పడుకొని ఉంటుంది. తన దగ్గరికి వెళ్లి కాంచన, దశరథ్, శివన్నారాయణ బాధపడుతారు. అప్పుడే కార్తీక్ వస్తాడు. నేను చిన్నప్పుడు అత్త దగ్గరే పెరిగాను. అత్త కొడుకు లేని లోటు నా ద్వారా తీర్చుకుంది. అలాంటి అత్త ఈ పరిస్థితిలో ఉందంటే నేను తట్టుకోలేకపోతున్నాను కానీ ఈ గుండె అన్నీ తట్టుకుంటుంది. ఇప్పుడు మనం ధైర్యంగా ఉండి అత్తకి ధైర్యం చెప్పాలని వాళ్ళతో కార్తీక్ చెప్తాడు.

మరొకవైపు పారిజాతం, జ్యోత్స్న దగ్గరకి దాస్ వస్తాడు. ఎందుకు నన్ను రమ్మన్నారని అడుగుతాడు. నువ్వే నీ కూతురుని కాపాడాలిరా అని పారిజాతం అంటుంది. అసలైన వారసురాలు ఎక్కడ ఉందో తీసుకొని రా అని పారిజాతం అంటుంది. అంటే ఇప్పుడు మీ భయం ఏంటి.. సుమిత్ర వదిన చచ్చిపోతుందనా.. లేక జ్యోత్స్న గురించి నిజం తెలిసిపోతుందనా.. అని దాస్ అనగానే రెండు అని పారిజాతం అంటుంది. ఇప్పుడు నిజం తెలిస్తే నీ కూతురు జీవితం రోడ్డున పడుతుందని పారిజాతం అనగానే నేను ఉన్నాను కదా ఏ లోటు లేకుండా చూసుకుంటానని దాస్ అంటాడు. అది ఒక బ్రతుకేనా అని జ్యోత్స్న అంటుంది. నువ్వు ఇదొక్క సహాయం చెయ్ రా.. అసలైన కూతురిని వెతికి తీసుకొని రా.. నేను మేనేజ్ చేసి సుమిత్రకి సర్జరీ అయ్యేలా చేస్తానని పారిజాతం అంటుంది. అసలైన కూతురు ఎక్కడ ఉందని పారిజాతం అనగానే ఇక్కడే ఉందని దాస్ అంటాడు.

అప్పుడే దీప కాఫీ తీసుకొని వచ్చి దాస్ కి ఇస్తుంది. దీప వెళ్లి కార్తీక్ తో దాస్ బాబాయ్ వచ్చాడు. వీళ్ళు దాస్ బాబాయ్ ని రప్పించారంటే ఏదో ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతుందని కార్తీక్ తో దీప అంటుంది. మరొకవైపు ఈ రోజు ఎలాగైనా శివన్నారాయణ గారితో నిజం చెప్తానని దాస్ అంటుంటే.. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. నాతో ఏం చెప్పాలని అడుగుతాడు. అ తర్వాత దాస్ ని ఇంట్లోకి తీసుకొని వెళ్లి అందరి ముందే అడుగుతాడు. నాకు చెప్పు అని దశరథ్ అనగానే.. అన్నయ్య మీకు చాలా ద్రోహం చేసానని దాస్ అంటాడు‌. ఎవరి గురించి మాట్లాడుతున్నావని దశరథ్ అనగానే జ్యోత్స్న గురించి అని దాస్ అంటాడు. వద్దని.. నిజం చెప్పొద్దని దాస్ ని జ్యోత్స్న, పారిజాతం రిక్వెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.