English | Telugu

రిషి, వసుధార నిజంగా పెళ్లి చేసుకుంటే అంతే...మహాభారతంలో పేరుతో తిట్టుకుంటారు!

గుప్పెడంత మనసు సీరియల్ కార్తీక దీపంతో పోటాపోటీగా రన్ అవుతున్న సీరియల్. ఈ సీరియల్ లో మహేంద్ర, జగతి, రిషి, వసుధారా క్యారెక్టర్స్ ఫుల్ హైలైట్. అందులోనూ రిషి, వసుధార గురించి ఇంకా చెప్పక్కర్లేదు. వాళ్ళు నటనలో జీవించేస్తారు. ఐతే ఆఫ్ స్క్రీన్ లో వీళ్ళు టామ్ అండ్ జెర్రీ కంటే ఎక్కువగా ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు అని సాయికిరణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. "ఎందుకు గొడవ పడతారో తెలీదు. ఒకళ్ళ కాలు ఇంకొకళ్ళు తొక్కి కంప్లైంట్ చెప్పడం..ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు పోసుకుని తిట్టుకోవడం వంటివి చేస్తుంటారు. ఆ తిట్లు కూడా మహాభారతంలో క్యారెక్టర్లతో పిలుచుకుని మరీ తిట్టుకుంటారు.

హిడింబి అని, కుంభకర్ని అని, రావణ అని, సూర్పణకి ఇలా. ఇక వీళ్ళిద్దరూ నిజ జీవితంలో పెళ్లి చేసుకుంటే ఇంకా అంతే సంగతులు. ఒకళ్ళనొల్లకు పొడుచుకు చచ్చిపోతారు అందుకే ఇద్దరూ అస్సలు పెళ్లి చేసుకోకూడదు. వాళ్లకు ఒక్క నిమిషం కూడా పడదు. ఎందుకో తెలీదు.

ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టడమే వాళ్ళ ధ్యేయంలా అనుకుంటారు. ముఖేష్ గురించి చెప్పాలంటే చాలా మంచివాడు. వాళ్ళ పేరెంట్స్ అతన్ని బాగా పెంచారు. చాలా సాఫ్ట్ గా , ఇన్నోసెంట్ గా ఉంటాడు. నాకు రిషి, వసుధార అంటే చాలా ఇష్టం. అందుకే ఇద్దరికీ ప్రతీ నెలా ఏదో ఒకటి బర్త్డే గిఫ్ట్ లా ఇస్తూ ఉంటాను" అని చెప్పారు సాయికిరణ్.