English | Telugu
దేవుడు నాకు కనిపిస్తే మా నాన్న కావాలని అడుగుతాను
Updated : Sep 9, 2022
కీర్తి భట్ బుల్లి తెర మీద ఫేమస్ ఐన నటి. "మనసిచ్చి చూడు" సీరియల్ లో హీరోయిన్ గా, "కార్తీక దీపం" సీరియల్ లో హిమగా ఫేమస్ అయిన కీర్తి భట్ జీవితంలో ఎంతో విషాదం ఉంది. ఇప్పుడు కీర్తి బిగ్ బాస్ సీజన్ 6 హౌస్ లోకి "గాంధారీ గాంధారీ" అనే సాంగ్‌కు స్టెప్పులేస్తూ ఫస్ట్ కంటెస్టెంట్ గా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఐతే హౌస్ లోకి వెళ్లకుముందు ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
"ఒకరోజు ధర్మస్థలికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వస్తున్నాం. ఐతే మా నాన్న దేవుడి ప్రసాదాన్ని దారిలో ఉన్న తన ఫ్రెండ్ కి ఇచ్చేసి వెళ్ళిపోదాం అన్నాడు.. అలా ప్రసాదం ఇచ్చి రిటర్న్ అవుతున్న టైంలో జరిగిన ఆక్సిడెంట్ తో నా జీవితం అంతా తల్లకిందులైపోయింది. నేను 32 రోజులు కోమాలో ఉన్నా. తర్వాత తెలిసిన అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నా. నాన్న ఉన్నప్పుడు అన్నీ ఆయనే నాకు. అమ్మతో అంత బాండింగ్ లేదు నేనెప్పుడూ అమ్మ అని కూడా పిలిచేదాన్ని కాదు పేరు పెట్టి పిలిచేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఒక బిడ్డను దత్తత తీసుకున్నాక తెలిసింది అమ్మ విలువ. ఎన్ని రోజులు ఏడ్చానో లెక్కేలేదు. నాకు దేవుడు కనిపిస్తే మా నాన్న కావాలని అడుగుతాను...మా నాన్న కనిపిస్తే నన్ను ఎందుకు వదిలేసి వెళ్లిపోయావని అడుగుతాను" అంటూ ఎమోషనల్ అయ్యింది కీర్తి.
"ఒక రోజు ఫ్రెండ్స్ తో కలిసి పార్టీకి వెళ్ళాను. ఐతే అక్కడ అందరు డ్రగ్స్ తీసుకుంటున్నారు. నాకు తెలీదు. అప్పుడు నాన్న ఫోన్ చేసేసరికి చెప్పాను లొకేషన్ షేర్ చేయమన్నారు వెంటనే వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్లారు. అలాగే ఫ్రెండ్స్ అందరిని రెండో రోజు ఇంటికి రమ్మన్నారు. నన్ను కొడతారనుకున్న..కానీ ఒక్కమాట కూడా అనలేదు. అందరూ వచ్చాక ఎవరి మీద అరవలేదు, కోప్పడలేదు..మీ పేరెంట్స్ అంతా మీ మీద ఆశలు పెట్టుకుని ఉంటారు. వాళ్ళను ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకునే పనులు చేయొద్దని చెప్పారు. బతికినంతకాలం నీ మీద ఎలాంటి బ్లాక్ మార్క్ ఉండకూడదు...ఎవరూ వేలెత్తి చూపించకూడదు అని చెప్పారు.. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నాన్న మాటకు కట్టుబడి ఉన్నాను." అంటూ చెప్పింది కీర్తి.