English | Telugu

మేమెప్పటికీ విడిపోము...ఆ రెండు కుర్చీలు ఖాళీ కావడం నిజంగా బాధాకరం  

సిక్స్త్ సెన్స్ సీజన్ 5 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి నటుడు నరేష్, పవిత్ర లోకేష్ వచ్చారు. వీళ్ళ ఇద్దరి రియల్ స్టోరీనే సినిమాగా "మళ్ళీ పెళ్లి" పేరుతో త్వరలో రాబోతోంది. "మీరు ముద్దుగా పవిత్ర లోకేష్ గారిని ఏమని పిలుస్తారు" అని ఓంకార్ అడిగేసరికి "అమ్ములు అని పిలుస్తాను ఇంకా ముద్దొస్తే అమ్ము అంటాను... ఇంకా ముద్దొస్తే..వద్దులే " అని తప్పించుకున్నాడు నరేష్. వీళ్ళతో పాటు ఈ స్టేజి మీద ఆడియన్స్ ని అలరించడానికి "డెడ్ పిక్సల్స్ మూవీ టీమ్ నుంచి నిహారిక కొణిదెల, అక్షయ్, సాయి రోనాక్ వచ్చారు, ఇంకా సేవ్ ది టైగర్స్ మూవీ నుంచి అభినవ్, పావని గంగిరెడ్డి వచ్చారు. కాసేపు సాంగ్స్ , డాన్సేస్ తో ఎంటర్టైన్ చేశారు... కృష్ణ చేసి "జుంబారే " సాంగ్ కి ఆయన్ని ఇమిటేట్ చేస్తూ నరేష్ డాన్స్ చేసాడు.

తర్వాత ఓంకార్ " మీ రిలేషన్ షిప్ స్టేటస్ ఏమిటి" అని అడిగేసరికి "ఆకాశం మీద పడినా, భూమి బద్దలైనా మేమిద్దరం కలిసే ఉంటాం" అని చెప్పాడు నరేష్. "కృష్ణ గారు అంటే మీకు ఎంత ఇష్టం" అని నరేష్ ని అడిగాడు ఓంకార్. "అమ్మ చనిపోయినప్పుడు ఇంకా మమ్మీ అని పిలుచుకునే పిలుపు లేదని అనుకున్నా..అమ్మ కృష్ణ గారు ఇద్దరూ ప్రతీక్షణం కలిసే ఉండేవాళ్ళు. షూటింగ్ ఉన్నా లేకపోయినా కలిసే ఉండేవాళ్లు. అమ్మ పోయాక ఇద్దరి చైర్స్ లో ఒకటి ఖాళీగా కనిపించింది. అప్పుడు నా మనసు చాలా బాధపడేది. ఆయనలో అమ్మను చూసుకునేవాడిని. నేను ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు తన పక్క సీట్ లో అమ్మ ఫోటో పెట్టుకునేవారు. ఆయన ఆమెను ఎంత మిస్ అయ్యారో అప్పుడు తెలిసింది. అంతలోనే ఆయన కూడా సడెన్గా వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోవడం ఆ రెండు చైర్స్ ఖాళీ కావడం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు." అని ఫీలవుతూ చెప్పాడు నరేష్. ఇలా కొంచెం ఫన్నీగా, ఇంకొంచెం ఎమోషనల్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ రాబోతోంది.


Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.