English | Telugu

కాళ్ళతో తన్నినా వేణుమాధవ్ నన్ను మెచ్చుకున్నారు!

ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పేరు రావాలంటే ఎంతో కష్టం. కొంతమందికి ఎన్నాళ్ళు చేసినా మంచి పేరు రాదు. కానీ కొందరికి మాత్రం ఓవర్ నైట్ లో స్టార్డమ్ వచ్చి పడిపోతుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గుమ్మడి జయవాణికి కూడా అంతే. గయ్యాళి పాత్రల ద్వారా ఫుల్ ఫేమస్ ఐపోయింది. రోల్ ఎలా డిమాండ్ చేస్తే అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ మంచి పేరు తెచ్చుకుంది. చిన్నప్పటినుంచి ఆమెకు నటన అంటే చాలా ఇష్టం. చదువుకునే టైములో పెళ్లి చేసేసారు ఆమెకు ఇంట్లోవాళ్ళు.

పెళ్ళికి ముందు సినిమాల్లోకి వెళతానన్న జయవాణి కోరికను ఆమె తల్లితండ్రులు యాక్సెప్ట్ చేయలేదు. పెళ్లయ్యాక భర్త సపోర్ట్ తో ఇండస్ట్రీలోకి వచ్చింది.మొదట సీరియల్స్ లో నటించింది. తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్స్ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టింది.విక్రమార్కుడు, యమదొంగ, మహాత్మా, గుంటూరు టాకీస్ లాంటి మూవీస్ జయవాణికి మంచి ఫేమ్ తీసుకొచ్చాయి. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ టాపిక్స్ చెప్పింది.

తాను ఏదైనా క్యారెక్టర్ లో ఒక్కసారి ఇన్వాల్వ్ అయితే అందులోంచి బయటికి రావడం అంత ఈజీ కాదు, చాలా టైం పడుతుందని చెప్పింది. క్యారెక్టర్ లోకి దిగాక ఏం జరిగినా పట్టించుకోకుండా నటించేస్తానని అందుకు సంబంధించిన ఒక ఇన్సిడెంట్ ని ఆడియన్స్ తో షేర్ చేసుకుంది. ‘అదిరిందయ్యా చంద్రం' మూవీలో వేణు మాధవ్ రోడ్డుపై తాగిపడిపోతే.. అతన్ని లేపి ఇంటికి తీసుకెళ్లే సీన్ చేయాలనీ చెప్పి, రిహార్సల్ చేయించారు డైరెక్టర్.

"అయితే.. ఆ రోల్ కి కేవలం డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి. ఆ సీన్ అంతా అర్థమయ్యాక డైలాగ్స్ తో అంత బాగా రాదనుకున్నా. ఇక కెమెరా ఆన్ అయ్యి 'యాక్షన్' అనగానే.. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి వేణుమాధవ్ ని కాళ్లతో తంతూ తీసుకెళ్ళాను. అసలు నేనేం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు. కానీ ఆ సీన్ టేక్ మాత్రం ఓకే అయిపోయింది. అయితే డైరెక్టర్ టెన్షన్ పడుతూ వచ్చి, 'సీన్ లో ఆయన్ని తన్నుకుంటూ తీసుకెళ్లడమే లేదు కదా మరి నువ్వెందుకు అలా చేసావ్?. ఒకవేళ వేణుమాధవ్ కి కోపం వచ్చి షూటింగ్ మధ్యలోనే వెళ్ళిపోతే ఏంటి నా పరిస్థితి ?' అన్నారు. అప్పుడే వేణుమాధవ్ వచ్చి, సీన్ చాలా బాగా చేశావని మెచ్చుకున్నారు. అప్పుడు నేను హమ్మయ్య అనుకున్నాను" అంటూ చెప్పుకొచ్చింది జయవాణి.