English | Telugu
అలియా పెళ్లిపై బిగ్ బాస్ విన్నర్ షాకింగ్ పోస్ట్!
Updated : Apr 16, 2022
బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్ బీర్ కపూర్ - అలియా భట్ ఐదేళ్ల నిరీక్షణ తరువాత ఏప్రిల్ 14న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొంత కాలంగా ప్రేమలో వున్న క్యూట్ జోడీ ఎట్టకేలకు ఒక్కటయ్యారు. దాదాపు గత రెండేళ్లుగా కరోనా తో పాటు వివిధ కారణాల వల్ల వీరి వివాహం వాయిదా పడుతూ వస్తోంది. చివరికి పరిస్థితులు అనుకూలించడం తో వివాహ బంధంతో మొత్తానికి ఒక్కటయ్యారు. ముంబైలోని బాంద్రాలో జరిగిన వీరి వివాహానికి కపూర్ ఫ్యామిలీ తో పాటు మహేష్ భట్ ఫ్యామిలీ.. బాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు హాజరయ్యారు.
మొత్తానికి ఐదేళ్ల ప్రేమాయణం తరువాత లవ్ బర్డ్స్ పెళ్లిబంధంతో ఒక్కటి కావడంతో అభిమానులు, సెలబ్రిటీలు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్ని మాత్రం ఫీలవుతున్నాడు. తను ఐలవ్ యూ చెప్పిన అలియా పెళ్లైపోవడంతో విచారాన్ని వ్యక్తం చేస్తూ తల పట్టుకుంటున్నాడు. కొత్త జంట అలియా - రణ్ బీర్ లకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే తనకు అన్యాయం చేశారంటూ తల పట్టుకున్న ఎమోజీని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి షాకిచ్చాడు సన్నీ.
అలియా భట్ కు సన్నీ వీరాభిమాని. అంతే కాకుండా సన్నీకి అలియా డ్రీమ్ గాళ్ కూడా. జర్నలిస్టుగా వున్న సమయంలో అలియాని కలిసి ఆమెతో `దబిడిదిబిడే` అనే బాలయ్య ఫేమస్ డైలాగ్ ని కూడా చెప్పించాడట. అంతే కాకుండా బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలో లో అలియాభట్ - రణ్ బీర్ కపూర్, దర్శకుడు అయాన్ ముఖర్జీ పాల్గొన్నారు. ఆ తరువాత రాజమౌళి కూడా షోలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా అలియా భట్ .. సన్నీ గురించి తెలుసుకుని స్టేజ్ మీదుగా అతనికి ఐ లవ్ యూ చెప్పేసింది కూడా. దీంతో ఒక్క సారిగా సన్నీ షాక్ అయ్యాడు. అలా తనకు ఐ లవ్ యూ చెప్పిన అలియా తాజాగా పెళ్లి చేసుకోవడంతో సన్నీ తలపట్టుకున్నాడట. ప్రస్తుతం సన్నీ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.