English | Telugu

Spirit: రాజమౌళి, అల్లు అర్జున్ కి షాకిచ్చిన ప్రభాస్!

Publish Date:Jan 16, 2026

  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'స్పిరిట్'(Spirit). కేవలం ప్రకటనతోనే మోస్ట్ హైప్డ్ ఇండియన్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను రివీల్ చేశారు మేకర్స్.   2027 సంక్రాంతి కానుకగా 'స్పిరిట్' విడుదల కానుంది అంటూ రీసెంట్ గా సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించడం విశేషం.   స్పిరిట్ సినిమాను 2027, మార్చి 5న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. పాన్ ఇండియా భాషలతో పాటు, పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది.   ఇదిలా ఉంటే మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న 'వారణాసి'తో పాటు, అల్లు అర్జున్- అట్లీ కాంబోలో తెరకెక్కుతోన్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 'AA22'ని కూడా 2027, మార్చిలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విడుదల తేదీలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పుడదే మార్చి నెలలో స్పిరిట్ మూవీ కర్చీఫ్ వేయడం సంచలనంగా మారింది.   ఈ మూడూ ఇండియాలో రూపొందుతోన్న భారీ సినిమాలు. అలాంటిది ఈ మూడు సినిమాలు తక్కువ వ్యవధిలో విడుదలైతే.. ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయం.    

Sharwa announces his next Sankranti film with Srinu Vaitla

Publish Date:Jan 16, 2026

Charming Star Sharwanand has once again proved that the Sankranti season is his home ground, delivering a huge blockbuster with his latest family entertainer, Nari Nari Naduma Murari. Previously, he shook the box office with hits like Shatamanam Bhavati and Express Raja, and now NNNM has become hit with a unanimous positive response. Directed by Ram Abbaraju and produced by AK Entertainments, the film has turned into a volcanic success, delighting family audiences across the nation. Sharwanand said, "I was always confident that NNNM will be a huge blockbuster. Not just for Sankranti, the film would have been blockbuster any day it releases but the season will enhance the returns. I am happy looking at audience reactions thanking me for delivering a big hit and I am thrilled to see so much love for our film." He further mentioned the hardships faced during shooting but credited the team effort and ground-breaking writing for this victory. In an exciting update that has thrilled fans, Sharwanand has officially locked his next massive project with the king of comedy, Srinu Vaitla. Doubling down on his lucky streak, the actor announced that this highly anticipated collaboration is being aimed for Sankranti 2027.  Cheekily, he added, "Sharwa Sankranti is a lucky charm for the industry and I will keep continuing it." With Samyuktha and Sakshi Vaidya adding glamour to the current hit, the stage is now set for another storm in 2027. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

ఒకే సంవత్సరం 8 సినిమాలు.. అందులో 5 బ్లాక్‌బస్టర్స్‌.. అదీ శోభన్‌బాబు స్టామినా!

Publish Date:Jan 14, 2026

(జనవరి 14 శోభన్‌బాబు జయంతి సందర్భంగా..) 1937 జనవరి 14న కృష్ణా జిల్లాలో జన్మించిన ఉప్పు శోభనాచలపతిరావు అలియాస్‌ శోభన్‌బాబు తెలుగు చలన చిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరుచుకున్న హీరో. తను హీరోగానే రిటైర్‌ అవుతాను తప్ప క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ప్రేక్షకులకు కనిపించకూడదు అని దృఢంగా నిశ్చయించుకున్న ఆయన.. హీరోగానే రిటైర్‌ అయ్యారు. ఆ తర్వాత తండ్రిగా, తాతగా నటించే అవకాశాలు ఎన్ని వచ్చిన క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేయలేదు. శోభన్‌బాబు కెరీర్‌ ఎంతో విలక్షణంగా సాగింది. హీరోగా తనను తాను ప్రూవ్‌ చేసుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. 1959లో దైవబలం చిత్రంతో నటుడిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన శోభన్‌బాబు.. సోలో హీరో అవ్వడానికి 7 సంవత్సరాలు పట్టింది. పాతిక సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు, కొంత ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లు చెయ్యాల్సి వచ్చింది.   హీరోగా నిలదొక్కుకున్న తర్వాత ఆయన్ని స్టార్‌ హీరోని చేసిన సంవత్సరం 1975. శోభన్‌బాబు కెరీర్‌లో ఈ సంవత్సరానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరం ఆయన నటించిన 8 సినిమాలు రిలీజ్‌ కాగా, అందులో 5 సినిమా బ్లాక్‌బస్టర్స్‌గా, శతదినోత్సవ సినిమాలుగా నిలిచాయి. అంతేకాదు, తను చేసిన సినిమాల మధ్యే పోటీ ఏర్పడడం విశేషంగా చెప్పుకోవచ్చు.   1975 సంవత్సరం జనవరిలో తాతినేని రామారావు దర్శకత్వంలో రూపొందిన ‘దేవుడు చేసిన పెళ్లి’ చిత్రం విడుదలైంది. శోభన్‌బాబు హీరోగా నటించిన తొలి కలర్‌ సినిమా ఇదే. ఈ సినిమాలో శారద ద్విపాత్రాభినయం చేశారు. చక్కని కథ, గుండెల్ని పిండేసే సెంటిమెంట్‌ ప్రధానంగా సాగే ఈ సినిమాను 15 కేంద్రాల్లో 50 రోజులు, 3 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించారు. తెలుగు చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లలో ఉదయం ఆటను ప్రత్యేకంగా మహిళల కోసం కేటాయించారు.   ఏప్రిల్‌లో ఎస్‌.ఎస్‌.బాలన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘అందరూ మంచివారే’. అంతకుముందు ‘మంచి మనుషులు’ వంటి సూపర్‌హిట్‌ చిత్రంలో కలిసి నటించిన శోభన్‌బాబు, మంజుల ఈ సినిమాలో మరోసారి జోడీ కట్టారు. సాంఘిక చిత్రాల్లో తొలిసారి ఈ సినిమా కోసం 6 లక్షల రూపాయలతో ఒక భారీ సెట్‌ను నిర్మించడం విశేషం. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు.   మే నెలలో కె.రాఘవేంద్రరావు దర్శకుడుగా రూపొందిన తొలి సినిమా ‘బాబు’ విడుదలైంది. ఇందులో శోభన్‌బాబు, వాణిశ్రీ, అరుణా ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించారు. 25 లక్షల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్‌ వచ్చాయి. తొలివారం 16 లక్షలు కలెక్ట్‌ చేయడం విశేషం. రెండు వారాల వరకు ఫర్వాలేదు అనిపించినా ఆ సమయంలోనే శోభన్‌బాబు, వాణశ్రీలతోనే కె.విశ్వనాథ్‌ రూపొందించిన ‘జీవనజ్యోతి’ విడుదలై ఘనవిజయం సాధించడంతో ‘బాబు’ చిత్రంపై ఆ ప్రభావం ప‌డింది. ఫలితంగా ‘బాబు’ ఏవరేజ్‌ మూవీగా నిలిచింది.   శోభన్‌బాబు, శారద జంటగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ‘బలిపీఠం’ చిత్రం జూలై 17న విడుదలైంది. రంగనాయకమ్మ కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్ని ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. శోభన్‌బాబు, శారద నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.   శోభన్‌బాబు, మంజుల జంటగా వి.మధుసూదనరావు దర్శకత్వంలో రూపొందిన ‘జేబుదొంగ’ చిత్రం ఆగస్ట్‌ 14న విడుదలైంది. అప్పటి వరకు ప్రేమకథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు చేస్తూ వచ్చిన శోభన్‌బాబుపై జేబుదొంగ అనే టైటిల్‌ వర్కవుట్‌ అవ్వదని, తప్పకుండా ఫ్లాప్‌ అవుతుందని ఇండస్ట్రీలోని ప్రముఖులు భావించారు. కానీ, వారి అంచనాలను తారుమారు చేస్తూ సినిమా సూపర్‌హిట్‌ అయింది. ఈ సినిమా తర్వాత నవంబర్‌లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో శోభన్‌బాబు, మంజుల జంటగా వచ్చిన ‘గుణవంతుడు’ చిత్రం పెద్దగా ఆడలేదు.   ఇక ఈ సంవత్సరం డిసెంబర్‌ 19న వచ్చిన ‘సోగ్గాడు’ చిత్రం సంచలన విజయం సాధించి శోభన్‌బాబు పేరుకు ముందు సోగ్గాడు చేరింది. కె.బాపయ్య దర్శకత్వంలో డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమాలో జయచిత్ర, జయసుధ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అయి శోభన్‌బాబు కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌ మూవీగా నిలిచింది. ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా చాలా పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో మరో సినిమాతో కె.బాపయ్య బిజీగా ఉండడంతో హైదరాబాద్‌లో కొన్ని సన్నివేశాలను ఆయన కజిన్‌ కె.రాఘవేంద్రరావు చిత్రీకరించడం విశేషం. 1975లో శోభన్‌బాబు హీరోగా వచ్చిన 8 కలర్‌ సినిమాల్లో 5 సినిమాలు ఘనవిజయం సాధించాయి. అలా ఈ సంవత్సరం శోభన్‌బాబు కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన సంవత్సరంగా నిలిచింది.

ఆ సినిమా బ్యాన్‌ చెయ్యాలంటూ లేడీ గ్యాంగ్‌స్టర్‌ పిటిషన్‌.. 2 కోట్లు డిమాండ్‌!

Publish Date:Jan 14, 2026

వయొలెంట్‌ లవ్‌స్టోరీగా విజయ్‌ దేవరకొండ, సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను హిందీలో షాహిద్‌ కపూర్‌ హీరోగా ‘కబీర్‌ సింగ్‌’ పేరుతో రూపొందించారు సందీప్‌రెడ్డి. హిందీలో కూడా ఈ సినిమా సూపర్‌హిట్‌ అయింది. ఆ తర్వాత రణబీర్‌ కపూర్‌తో సందీప్‌ చేసిన ‘యానిమల్‌’ కూడా మోస్ట్‌ వయొలెంట్‌ మూవీగా నిలిచింది.    ఈ క్రమంలోనే షాహిద్‌ కపూర్‌ హీరోగా విశాల్‌ భరద్వాజ దర్శకత్వంలో హిందీలో ‘ఓ రోమియో’ పేరుతో ఓ సినిమా రూపొందింది. ఫిబ్రవరి 13న ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన స్టిల్స్‌, ట్రైలర్‌ ఆల్రెడీ విడుదలయ్యాయి. వాటిని పరిశీలిస్తే.. అది కబీర్‌సింగ్‌, యానిమల్‌ సినిమాలను పోలి ఉంది. సినిమాలో పరిధులు దాటిన హింస ఉన్నట్టుగా తెలుస్తోంది.    ఇప్పుడు ‘ఓ రోమియో’ సినిమా చట్టపరమైన చిక్కుల్లో పడిరది.  ఈ చిత్రానికి సంబంధించి ముంబైకి చెందిన గ్యాంగ్‌స్టర్‌ హుస్సేన్‌ ఉస్తారా కుమార్తె సనోబర్‌ షేక్‌.. ‘ఓ రోమియో’ నిర్మాత సాజిద్‌ నడియాడ్‌వాలా, దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌లకు నోటీసులు పంపారు. ఈ సినిమా తన తండ్రి హుస్సేన్‌ ఉస్తారా జీవిత కథ ఆధారంగా రూపొందుతోందని, ఇందులోని కథ తన తండ్రికి వ్యతిరేకంగా ఉందని ఆమె ఆరోపిస్తున్నారు. అలా తమ కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు గానూ రూ.2 కోట్ల నష్టపరిహారాన్ని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని పిటిషన్‌ వేశారు.    ఈ సినిమా వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిందని ట్రైలర్‌లో ప్రస్తావించారు. దీంతో ఈ వివాదానికి బలం చేకూరింది. ఫిబ్రవరి 13న ‘ఓ రోమియో’ రిలీజ్‌ కాబోతోంది. ఇంకా నెలరోజుల వ్యవధి ఉంది. ఈలోగా ఈ సినిమాకి సంబంధించిన వివాదాన్ని కోర్టు ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంది. ఈ సినిమాలో షాహిద్‌ కపూర్‌, త్రిప్తి దిమ్రి, విక్రాంత్‌ మాస్సే, నానా పటేకర్‌, తమన్నా భాటియా, దిశా పటాని, అవినాష్‌ తివారీ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కమీనే, హైదర్‌, రంగూన్‌ తర్వాత షాహిద్‌, విశాల్‌ భరద్వాజ్‌ కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా ఇది. 

Brahmamudi : తప్పు ఒప్పుకున్న సాండి.. కావ్య పాపని మార్చేశారుగా!

Publish Date:Jan 16, 2026

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -930 లో.... కావ్య దగ్గరికి రాజ్ వెళ్తాడు. బావ అలా స్టేషన్ నుండి తప్పించుకొని మరొక కేసులో ఇరుకున్నాడని అప్పు ఇంట్లో వాళ్ళతో అంటుంది. ఏంటే నువ్వు చేసే డ్యూటీ.. గొప్ప సిన్సియర్ ఆఫీసర్ అని పేరు తెచ్చుకోవాలనుకుంటున్నవా అని అప్పుపై ఇందిరాదేవి కోప్పడుతుంది. నువ్వు అంత నిజాయితీగా పని చేస్తే.. రాజ్ ని అరెస్ట్ చెయ్యడం కాదు.. వాడు ఏ తప్పు చెయ్యలేదని నిరూపించమని ఇందిరాదేవి అంటుంది. అ తర్వాత అప్పు బయటకు వెళ్తుంది. కళ్యాణ్ తన వెంటే వెళ్తాడు. ఆ తర్వాత స్టేషన్ లో ఉన్న సాండి దగ్గరికి అప్పు, కళ్యాణ్ వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అప్పుడే ఇన్‌స్పెక్టర్ వస్తాడు. మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు లీవ్ లో ఉన్నావని అంటాడు. మా బావ గారిని అరెస్ట్ చెయ్యమన్నప్పుడు కూడా నేను లీవ్ లోనే ఉన్నాను కదా సర్.. ఇప్పుడు లీవ్ అని అంటున్నారని అప్పు అనగానే ఇన్‌స్పెక్టర్ సైలెంట్ అవుతాడు. మీరు FIR లో పదో తేదీ నా ఆఫీస్ కి వచ్చి మా బావకి ఇతను డబ్బు ఇచ్చినట్లు రాసాడు కానీ అ రోజు మా ఇంట్లో శ్రీమంతం జరిగింది ఎలా పాజిబుల్ అవుద్దని శ్రీమంతం రోజు ఫొటోస్ చూపిస్తుంది అప్పు. అ తర్వాత సాండి నేనే తప్పు చేసానని ఒప్పుకుంటాడు. మరొకవైపు కావ్యకి పాప పుడుతుంది. పాప వెయిట్ తక్కువ గా ఉంది. ఇంకుబేటర్ లో పెట్టాలని డాక్టర్ అంటుంది. ఒకసారి చూపించండి అని కావ్య అనగానే డాక్టర్ చూపిస్తుంది. మరొకవైపు మినిస్టర్ భార్యకి కూడా పాప పుడుతుంది. ఆ పాప పుట్టినప్పుడు ఏడవదు. దాంతో తనని కూడా ఇంకుబేటర్ లో పెడుతారు. తరువాయి భాగంలో కావ్యకి తన పాపని ఇస్తారు. తనని చూసి ఈ పాప నా పాప కాదని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

NBK 111: బాలయ్య ఫ్యాన్స్ కి ఊహించని షాక్!

Publish Date:Jan 5, 2026

  బాలకృష్ణ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ హిస్టారికల్ ఫిల్మ్ ని పక్కన పెట్టారా? NBK 111 కొత్త స్టోరీ ఏంటి? నయనతార ప్లేస్ లో ఎవరు?   'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), గోపీచంద్ మలినేని మరో ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపిన విషయం తెలిసిందే. బాలకృష్ణ కెరీర్ లో 111వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. ఈ హిస్టారికల్ ఫిల్మ్ లో నయనతార హీరోయిన్. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. (NBK 111)   బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో హిస్టారికల్ ఫిల్మ్ అనగానే.. అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమాని వెండితెరపై చూస్తామా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ కి షాకిచ్చేలా.. ఈ మూవీ స్టోరీ ఛేంజ్ అయినట్లు సమాచారం.   ప్రస్తుతం పెద్ద సినిమాల పరిస్థితి పెద్దగా బాలేదు. ఓటీటీ బిజినెస్ కూడా మునుపటిలా జరగడంలేదు. ఈ పరిస్థితులలో హిస్టారికల్ ఫిల్మ్ అయితే భారీ బడ్జెట్ అవుతుందనే ఉద్దేశంతో.. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ ని పక్కన పెట్టాలని టీమ్ నిర్ణయించిందట. దాని స్థానంలో మరో కొత్త స్క్రిప్ట్ తో సినిమా చేయబోతున్నారట. ఈ స్క్రిప్ట్ ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా ఉంటుందని, మలినేని ఈసారి అందరినీ సర్ ప్రైజ్ చేయడం ఖాయమని అంటున్నారు.   Also Read: రాశి సంచలన వీడియోతో చిక్కుల్లో అనసూయ.. క్షమాపణలు చెబుతుందా?   అలాగే 'NBK111' హీరోయిన్ కూడా మారనున్నట్లు వినికిడి. హిస్టారికల్ ఫిల్మ్ అనుకున్నప్పుడు హీరోయిన్ గా నయనతారను ప్రకటించారు. ఆమె రెమ్యూనరేషన్ రూ.10 కోట్లకు పైగా ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్ ని కంట్రోల్ చేయడం కోసం ఆమెకు బదులుగా మరో హీరోయిన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట.   'NBK111' గురించి వినిపిస్తున్న వార్తల్లో నిజానిజాలు ఎంతో తెలియదు కానీ.. ఇటీవల కాలంలో బడ్జెట్ లు పెరిగిపోయి నష్టపోతున్నామంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బడ్జెట్ విషయంలో ముందే జాగ్రత్తలు తీసుకోవడం అనేది అభినందించదగ్గ విషయమే.  

Tiger Shroff to be part of Allu Arjun and Atlee film?

Publish Date:Jan 6, 2026

Allu Arjun has delivered a massive blockbuster with Pushpa 2 The Rule and his market in North India is huge. Taking that into consideration, Sun Pictures have accepted to give Atlee, a free hand to make his sci-fi fantasy drama on a never-seen-before scale with Hollywood VFX Studios, Action Co-ordinators collaborating on it.  Now, the reports suggest that the movie could be spilt into two parts and both will be shot at one go. The movie team won't be going back to shoot the second part but rather they would be spending 6-8 months on VFX and scale of the second part, if the reports are true.  Currently, the reports suggest that Tiger Shroff is in talks and he even joined the film for a crucial part. Will he be playing an antagonist or supporting protagonist is yet to be known. Vijay Sethupathi is said to be a part of the film. Already, Deepika Padukone is part of the film and she completed two schedules.  Mrunal Thakur and Janhvi Kapoor are said to be part of the project as there will be a triple role for Allu Arjun with connection between past lives and future. We have to wait and see, how many of these reports will emerge to be true. Atlee is currently working on meeting a Hollywood Studio to distribute the film, state reports.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

Nari Nari Naduma Murari

Publish Date:Dec 31, 1969

Anaganaga Oka Raju

Publish Date:Dec 31, 1969

The Raja Saab

Publish Date:Dec 31, 1969