English | Telugu

సితార బోల్డ్ మూవీ.. డైమండ్ ని పక్కన పెట్టేశారా?

సితార బోల్డ్ మూవీ.. డైమండ్ ని పక్కన పెట్టేశారా?

Publish Date:Jul 6, 2025

  "If middle finger was a man" అంటూ తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలను జూలై 9న రివీల్ చేస్తామని తెలిపింది. ఇదొక సినిమా అనౌన్స్ మెంట్ అని అర్థమవుతూనే ఉంది. అయితే అది ఏ సినిమా అనేదే ఇక్కడ ఆసక్తికరం.   డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డతో మరో సినిమాకి శ్రీకారం చుట్టింది సితార. రవికాంత్ పేరేపు డైరెక్ట్ చేయనున్న ఈ ఫిల్మ్ కి 'బ్యాడాస్' (BADASS) అనే టైటిల్ ను లాక్ చేసినట్లు సమాచారం.   నిజానికి సిద్ధు-రవికాంత్ కాంబినేషన్ లో గతేడాది 'కోహినూర్' అనే సినిమాని ప్రకటించింది సితార సంస్థ. 'కోహినూర్' డైమండ్ కథ నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలి అనుకుంది. కానీ, ఎందుకనో ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టారు. ఇప్పుడు అదే కాంబోలో 'బ్యాడాస్' సినిమా రాబోతుంది. ఇది సినిమా(సినీ పరిశ్రమ) గురించి తీస్తున్న సినిమా కావడం విశేషం. ఈ మూవీ బోల్డ్ గా ఉంటుందని టాక్. కాగా, గతంలో సిద్ధు-రవికాంత్ కాంబోలో 'కృష్ణ అండ్ హిజ్ లీలా' అనే సినిమా వచ్చింది.  
Why did UV Creations postponed Vishwambhara and Ghaati?

Why did UV Creations postponed Vishwambhara and Ghaati?

Publish Date:Jul 5, 2025

UV Creations is one of the biggest production houses in Telugu Cinema. They have made films like Mirchi, Run Raja Run, Bhale Bhale Magadivoy, Bhagamathie, Saaho, Radhe Shyam. But they faced huge losses with Saaho and Radhe Shyam. They announced biggies like Vishwambhara and Ghaati with Megastar Chiranjeevi and Anushka, respectively.  Now, the production house have indefinitely postponed Vishwambhara and Ghaati. They have first announced Vishwambhara for Sankranti release of 2025 and the teaser did not impress anyone. Hence, they have announced that they are re-working on the graphics and will announce the release date only when the output is ready.  They have announced Ghaati for April and then, they have postponed it to July 11th. Currently, they have postponed movie again and did not announce any release date. Why are they facing such a situation? Many inside reports are stating that the production house is facing issues with VFX companies, it seems.    To control the finances, they have given contract of handling their projects to few VFX companies as a whole, it seems. Those companies are facing issues with delivering the output as per expectations and hence, UV Creations have been forced to change companies or give them even more time to complete the work, it seems.  Due to these postponements, they are unable to convince OTT platforms to not cut the overall rights amounts, say reports. They are ready to face such losses but are on serious mission to find a better VFX outlet before they produce another film with Prabhas, on a massive scale, it seems. But for now, they are trying to sort out issues with the delaying VFX companies and until then, they won't give any offical release dates for both the films, it seems.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

3BHK Movie Review 

Publish Date:Jul 4, 2025

దశాబ్దకాలం హీరోయిన్‌గా చిత్ర పరిశ్రమను ఏలిన చలాకీ కన్నుల మంజుల!

Publish Date:Jul 4, 2025

(జూలై 4 నటి మంజుల జయంతి సందర్భంగా..) తమ అందం, అభినయంతో కథానాయికలుగా మంచి పేరు తెచ్చుకున్నవారు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు. వారిలో ప్రేక్షకుల మనసుకు దగ్గరైన వారు, వారి మనసుల్ని దోచుకున్న వారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో మంజుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందం, అభినయంతోపాటు చలాకీతనం, చిలిపితనం, కళ్ళతోనే నవ్వులు చిందించగల ప్రతిభ ఆమె సొంతం. మంజుల వంటి హీరోయిన్లు ఇండస్ట్రీకి అరుదుగా వస్తుంటారు. ఆమె అందానికి ఆరోజుల్లో ఎంతో మంది మనసు పాడుచేసుకున్నారు. కేవలం ఆమెను చూసేందుకే యూత్‌ మళ్ళీ మళ్ళీ థియేటర్స్‌కి వెళ్లేవారు. 40 సంవత్సరాల తన కెరీర్‌లో 100కి పైగా చిత్రాల్లో నటించారు మంజుల. దశాబ్దంపాటు తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ సినిమాల్లో తిరుగులేని కథానాయికగా పేరు తెచ్చుకున్న మంజుల జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. 1954 జూలై 4న మద్రాస్‌లో జన్మించారు మంజుల. ఆమె విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. చదువుతోపాటు కళల పట్ల కూడా ఆమె శ్రద్ధ చూపించేవారు. స్కూల్‌లో జరిగే కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌లో కూడా ఆమె పాల్గొనేవారు. చిన్నతనం నుంచీ ఎంతో చలాకీ ఉంటూ అందర్నీ ఆకర్షించేవారు మంజుల. ఎప్పుడూ నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండే మంజులకు సినిమాలపై ఆసక్తి కలిగింది. సినిమాల్లో నటించాలన్న ఆమె ఆలోచనను తల్లిదండ్రులు కూడా బలపరిచారు. 1970లో జెమిని గణేశన్‌ హీరోగా తమిళ్‌లో రూపొందిన ‘శాంతి నిలయం’ చిత్రం ద్వారా నటిగా పరిచయమయ్యారు మంజుల. అప్పటికి ఆమె వయసు 16 ఏళ్లు. ఆ సినిమాలో జెమినీ గణేశన్‌కు మేనకోడలి పాత్ర పోషించారు. ఆ తర్వాత ఎం.జి.రామచంద్రన్‌ హీరోగా వచ్చిన ‘రిక్షాకారన్‌’ చిత్రంలో తొలిసారి హీరోయిన్‌గా నటించారు.  జైజవాన్‌ చిత్రం ద్వారా తెలుగు తెరకు నటిగా పరిచయమయ్యారు మంజుల. మరపురాని మనిషి, నీతినిజాయితి చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించిన తర్వాత కృష్ణ హీరోగా రూపొందిన మాయదారి మల్లిగాడు చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. గ్లామర్‌ హీరోయిన్‌గా మంజులకు ఈ సినిమా చాలా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత తెలుగులో అందరు టాప్‌ హీరోల సరసన నటించారు. ఎన్టీఆర్‌తో వాడే వీడు, మనుషులంతా ఒక్కటే, దేవుడు చేసిన మనుషులు, నేరం నాది కాదు ఆకలిది, మా ఇద్దరి కథ, చాణక్య చంద్రగుప్త చిత్రాల్లో నటించారు. ఎఎన్నార్‌తో మహాకవి క్షేత్రయ్య, దొరబాబు, బంగారు బొమ్మలు సినిమాలు చేశారు. మాయదారి మల్లిగాడు తర్వాత కృష్ణతో భలే దొంగలు, మనుషులు చేసిన దొంగలు చిత్రాల్లో నటించారు మంజుల. అయితే తెలుగులో శోభన్‌బాబు కాంబినేషన్‌లో ఎక్కువ సూపర్‌హిట్‌ సినిమాలు చేశారు మంజుల. మంచి మనుషులు, పిచ్చిమారాజు, జేబుదొంగ, ఇద్దరూ ఇద్దరే, గుణవంతుడు, మొనగాడు సినిమాలు చేశారు. శోభన్‌బాబు, మంజుల హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. అలా పదేళ్ళపాటు గ్లామర్‌ హీరోయిన్‌గా తన హవాను కొనసాగించారు మంజుల.  1980వ దశకం వచ్చేసరికి మంజులకు హీరోయిన్‌గా అవకాశాలు తగ్గాయి. 1983 వరకు నటిగా కొనసాగిన ఆమె కొంత గ్యాప్‌ తీసుకొని 1988లో రాజేంద్రప్రసాద్‌ హీరోగా వచ్చిన చిక్కడు దొరకడు చిత్రంతో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారారు. టూ టౌన్‌ రౌడీ, ప్రేమ, చంటి, సరదాబుల్లోడు, వాసు వంటి సినిమాల్లో నటించారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా వెంకటేష్‌ సినిమాల్లోనే ఎక్కువగా నటించడం విశేషం. 2011లో వచ్చిన వాసు తెలుగులో మంజుల నటించిన చివరి సినిమా.  ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే.. 1976లో నటుడు విజయకుమార్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు వనిత, ప్రీత, శ్రీదేవి. వీరు కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్లుగా నటించారు. విజయకుమార్‌కు అంతకుముందే వివాహం అయింది. వారికి కలిగిన సంతానంలో అరుణ్‌ విజయ్‌ హీరోగా, విలన్‌గా రాణిస్తున్నారు. 2011 తర్వాత సినిమాలకు దూరమైన మంజుల.. కొన్ని తెలుగు, తమిళ సీరియల్స్‌లో నటించారు. అలాగే కొన్ని గేమ్‌ షోలలో కూడా కనిపించారు. 2013లో జూలై 23న మంజుల ప్రమాదవశాత్తూ మంచం మీద నుంచి కింద పడిపోవడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆ గాయంతోపాటు కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా అదేరోజు 59 ఏళ్ళ వయసులో తుది శ్వాస విడిచారు మంజుల. కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా మంజుల పేరుతో ఒక హీరోయిన్‌ ఉండేవారు. 1986లో వంటగదిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 31 ఏళ్ళ అతి చిన్న వయసులో మంజుల ప్రాణాలు విడిచారు. ఒకే పేరు ఉన్న ఈ ఇద్దరు నటీమణులు ప్రమాదవశాత్తూ మరణించడం గమనార్హం.

కాజల్ ఉండగా సాయి పల్లవి కోసం యుద్ధమా..?

Publish Date:Jul 6, 2025

  ఈ సోషల్ మీడియా యుగంలో.. సినిమా విడుదల వరకు కూడా అవసరంలేదు.. ప్రకటన సమయం నుంచే ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నింటినీ తట్టుకొని.. సినిమాను రిలీజ్ చేసి, కంటెంట్ తో మెప్పించి.. హిట్ కొట్టాలి. ఇప్పుడు అలాంటి టాస్కే 'రామాయణ' టీమ్ ముందు ఉంది.   బాలీవుడ్ లో 'రామాయణ' ఫిల్మ్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. నితేష్ తివారి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, మండోదరిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ కి కూడా మంచి స్పందన లభించింది. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. సీత, మండోదరి పాత్రలకు ఎంపిక చేసిన నటీమణుల విషయంలోనే సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి.    సాయిపల్లవి కంటే కాజల్ బాగుంటుంది.. అలాంటిది అంత అందమైన భార్యను కాదని, సాయిపల్లవి కోసం యశ్ యుద్ధానికి దిగుతాడా? అంటూ పలు మీమ్స్ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అయితే వీటిని సాయిపల్లవి ఫ్యాన్స్ తిప్పి కొడుతున్నారు. కాజల్ తో పోల్చి పల్లవిని తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదని అంటున్నారు. సాయి పల్లవి న్యాచురల్ బ్యూటీ అని.. పైగా ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో హీరోలనే డామినేట్ చేసిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సీతగా సాయిపల్లవిని స్క్రీన్ మీద చూసి అందరూ సర్ ప్రైజ్ అవ్వడం ఖాయమని చెబుతున్నారు.  

Illu illalu pillalu : పుట్టింటికి వెళ్ళిపోమన్న ధీరజ్.. రామరాజుని‌ చూసి సాగర్ షాక్!

Publish Date:Jul 5, 2025

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -203 లో... ప్రేమ, నర్మద ఇంటికి వస్తారు. ఈ రోజు మేం శ్రీవల్లి వాళ్ళ నాన్నని చూసాం.. సైకిల్ పై ఇడ్లీ అమ్ముతుంటే.. అనగానే అందరు షాక్ అవుతారు. శ్రీవల్లి మాత్రం టెన్షన్ పడుతుంది.    ఏంటి శ్రీవల్లి మీ నాన్న ఇడ్లీ అమ్మడం ఏంటని రామరాజు అడుగుతాడు. శ్రీవల్లి తడబడుతుంటే నేను ముందు నుండే అనుకున్న ఇడ్లీ బ్యాచ్ అని తిరుపతి అంటాడు. అంటే మావయ్య గారు శ్రీవల్లి వాళ్ళ నాన్న ఇడ్లీ అమ్మడం లేదు.. వాళ్ళు చిరు వ్యాపారం చేసేవారికి ఫైనాన్స్ ఇస్తారు కదా అలాంటి వాళ్ళకి బిజినెస్ లో మెలకువలు నేర్పిస్తాడట అని నర్మద అంటుంది. అవునా అని రామరాజు అంటాడు. ఇప్పుడే చెప్పను అక్కా.. ముందు ఉంది ముసళ్ల పండుగ.. అసలు ఏం జరుగుతుందనే విషయం కనుక్కోవాలని నర్మద అనుకుంటుంది.    మరొక వైపు ధీరజ్ షర్ట్ తో ప్రేమ మాట్లాడతుంది. నువ్వు ఒక్కడివే కష్టపడుతుంటే చూడలేకపోతున్న అందుకే నీకు తెలియకుండా నేను వర్క్ చేస్తున్నానని ప్రేమ అంటుంటే అప్పుడ్ ధీరజ్ వస్తాడు. అంతా విన్నాడేమోనని ప్రేమ టెన్షన్ పడుతుంది కానీ ధీరజ్ వినడు.   మరొకవైపు నర్మద, సాగర్ రాత్రి బయట కూర్చొని ఉంటారు. సాగర్ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతాడు. అదంతా శ్రీవల్లి చూసి కావాలనే రామరాజుకి చూపించాలని అనుకుంటుంది. మావయ్య దొంగ అంటూ అరుస్తుంది. అందరు బయటకు వస్తారు. సాగర్, నర్మదలని రామరాజు చూస్తాడు. రామారాజుని చూసి సాగర్ షాక్ అవుతాడు.    తరువాయి భాగంలో ప్రేమ తన పుట్టింటి వాళ్ళ ఫోటో చూసి బాధపడుతుంటే మరి మీ ఇంటికి వెళ్ళు అంటు ప్రేమని వాళ్ళ ఇంటిముందుకి నెట్టేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Nazeeruddin Shaik wins aha Telugu Indian Idol 3

Publish Date:Sep 23, 2024

In a thrilling grand finale streamed on aha OTT, 19-year-old Nazeeruddin Shaik from Andhra Pradesh emerged victorious as the winner of aha Telugu Indian Idol Season 3. His captivating performances throughout the competition earned him both the prestigious title and a cash prize of Rs. 10 lakh. Recently clearing his CA intermediate examinations, Nazeeruddin also received the exciting opportunity to lend his voice to the highly anticipated upcoming film starring Pawan Kalyan, OG. His remarkable journey to victory was characterised by consistent excellence, which endeared him to both the audience and the judges. Anirudh Suswaram secured second place, winning Rs. 3 lakh, while GV Shri Kerthi claimed third place with a prize of Rs. 2 lakh. The show, which concluded after nearly 26 weeks of fierce competition, was judged by the esteemed Thaman S, Geetha Madhuri, and Karthik, all of whom noted that this season showcased extraordinary talent. Judge Geetha Madhuri said, "aha Telugu Indian Idol Season 3 was an incredible experience filled with talented contestants. It truly felt like a celebration of music. Choosing the finalists was extremely challenging, and every elimination was painful." Nazeeruddin was born on November 2, 2004, in Tadepalligudem to Shaik Baji, a motor mechanic, and Madeena Beebi, who passed away a year ago. His sister, Vahida Rehman, has stepped in to support him after their mother's passing. He completed his schooling at Vignana Vikas E.M School and continued his education at GSR E.M School. He pursued his Junior College and CA Intermediate at Sri Medha Commerce College in Guntur, aspiring to become a Chartered Accountant while nurturing his passion for music. Nazeeruddin's musical journey has been profoundly shaped by his maternal grandparents, Kasim Saheb and Fatima Bee. His maternal grandmother, a Carnatic music guru, played a pivotal role in cultivating his talent. Growing up listening to the iconic songs of Ghantasala ignited his dedication to music. Reflecting on his victory, Nazeeruddin shared, "My journey with music began when I was just four years old. It was my grandfather, Kasim garu, and his sister whom I affectionately call Nani, who introduced me to this world. She enrolled me in Carnatic music lessons, while my grandfather taught me the nuances of cinematic music. Having sung for Ghantasala garu, his admiration for him has never wavered. For 47 years, he has honored Ghantasala's memory by observing his death anniversary in our village, Tadepalligudem. Thanks to my grandfather's efforts, a statue of Ghantasala garu stands in our village." "Winning the title of Telugu Indian Idol Season 3 is a key milestone for me. Performing in front of Thaman sir, Geetha Madhuri ma’am, and Karthik sir was an honor. Their feedback, along with lessons from my fellow contestants, has shaped my growth as a singer. Moving forward, I aim to be a leading musician in the industry while pursuing a career in finance, " he added. The competition began with over 15,000 aspiring singers, showcasing immense talent throughout the season. Initial auditions took place on May 4, 2024, in New Jersey and Hyderabad. The top 12 finalists included Bharat Raj, Keerthana, Keshav Ram, Hari Priya, GV Shri Kerthi, Nazeeruddin, Skanda, Duvvuri Sridhruthi, Rajani Sree, Sai Vallabha, Khushal Sharma, and Anirudh Suswaram. After rigorous eliminations and public voting across 28 episodes, the competition culminated in a final showdown featuring the top five contestants: Anirudh Suswaram, Skanda, Keerthana, Sri Keerthi, and Nazeeruddin. The finalists dazzled in vibrant attire during the blockbuster finale, which included special performances from the judges and contestants. Judge Geetha Madhuri, in a striking red outfit, captivated the audience with her exceptional performance. The Judges Thaman and Karthik also presented outstanding performances during the blockbuster finale episode. The blockbuster finale, streamed on September 20-21, 2024, celebrated the remarkable journeys of these talented singers. If you missed the thrilling finale episode, catch it now only on aha.

ప్రభాస్ 'స్పిరిట్'లో తరుణ్.. ఏం ప్లాన్ చేశావయ్యా సందీప్..!

Publish Date:Jul 6, 2025

  అప్పట్లో తరుణ్ కి తెలుగునాట లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ ఉండేది. కెరీర్ స్టార్టింగ్ లో 'నువ్వే కావాలి', 'నువ్వు లేక నేను లేను', 'నువ్వే నువ్వే' వంటి విజయవంతమైన చిత్రాలతో యువతకు ఎంతగానో చేరువయ్యాడు తరుణ్. అయితే ఆ తర్వాత మాత్రం పెద్దగా విజయాలు చూడలేదు. ఇక కొన్నేళ్లుగా అసలు నటనకే దూరమయ్యాడు. అలాంటి తరుణ్ రీ-ఎంట్రీకి రెడీ అయినట్లు తెలుస్తోంది. అది కూడా స్పిరిట్ సినిమాతో అని ప్రచారం జరుగుతోంది.   ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ స్పిరిట్. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై అంచనాలు భారీస్థాయిలో నెలకొన్నాయి. ఇందులో కొరియన్ యాక్టర్ డాన్ లీ విలన్ గా నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో స్పిరిట్ పై అంచనాలు మరోస్థాయికి వెళ్ళాయి. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే స్పిరిట్ లో తరుణ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వినికిడి.    ఇటీవల తరుణ్.. డాన్ లీతో దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దాంతో తాను స్పిరిట్ లో నటిస్తున్నానని హింట్ ఇచ్చినట్లుగా ఉంది. ఆ ఫొటో చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అప్పట్లో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న తరుణ్.. ఇప్పుడు రీ-ఎంట్రీలో ఎలా కనిపిస్తాడనే ఆసక్తి నెలకొంది.   సందీప్ రెడ్డి సినిమాల్లో పాత్రలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో తెలిసిందే. 'యానిమల్'లో బాబీ డియోల్ కి అదిరిపోయే బ్రేక్ ఇచ్చాడు. నిడివి తక్కువయినా, డైలాగ్స్ లేకపోయినా.. బాబీ డియోల్ రోల్ ని సందీప్ చూపించిన తీరు ఆకట్టుకుంది. దానిని దృష్టిలో పెట్టుకునే.. స్పిరిట్ లో తరుణ్ ని ఎలా చూపిస్తాడనే ఇంట్రెస్ట్ కలుగుతోంది.    

Sudha Kongara & Hombale project is going to be Biggest Multistarrer

Publish Date:Jul 12, 2022

Even though it came before 'KGF,' Hombale Films became well-known with that film. The films are being announced, completed, and ready for release as a result of the momentum created by that film. Production is currently working on 'Salaar' in Telugu and 'Tyson' in Malayalam. Other pan-India films have also just been announced.   However, a film directed by Sudha Kongara was recently announced. Except for the fact that they stated that it will be a big film, they did not mention the casting. There are some new rumours floating around about this. If those rumours are true, this combination will be spectacular. According to sources, Sudha Kongara project is going to be multi starrer.  Furthermore, the names of those heroes are currently being spread.   According to the latest rumours, this film would star Suriya and Dulquer Salman, who have established as star heroes in the South with a string of superhits. According to industry reports, Surya, who has become acquainted of Sudha Kongara's direction in 'Akaasham Nee Haddura,' responded OK without even hearing the story. It is stated that discussions about this film are ongoing, and that full details will be released soon. Pre-production work will begin soon.   Hombale is synonymous with big-budget films. This film is expected to be in the same budget range as the previous one. Suriya's film is also popular in Telugu. Dulquer films have a cult following in the South. This combination is surely going to be crazy.

Ranbir and Alia in love

Publish Date:May 10, 2018

తమ్ముడు

Publish Date:Jul 4, 2025

కన్నప్ప

Publish Date:Jun 27, 2025

కుబేర

Publish Date:Jun 20, 2025

Thammudu

Publish Date:Jul 4, 2025

Uppu Kappurambu

Publish Date:Jul 4, 2025

Kannappa

Publish Date:Jun 27, 2025

Kuberaa

Publish Date:Jun 20, 2025

8 Vasantalu

Publish Date:Jun 20, 2025