English | Telugu

సర్దార్ జీ 3 లో పాకిస్థాన్ నటిని ఏ విధంగా తీసుకున్నారు..సిద్దు సమాధానం ఏంటో తెలుసా!

ఏప్రిల్ నెలలో 'పాకిస్థాన్' కి చెందిన తీవ్రవాదులు కాశ్మీర్ లోని మన భూమండలంలోకి చొరబడి 28 మందిని చంపడంతో పాటు మరికొంత మందిని గాయపరిచారు. అందుకు ప్రతీకారకంగా మన సైన్యం పాకిస్థాన్ లో 'ఆపరేషన్ సిందూర్' ని నిర్వహించి తీవ్రవాదులని మట్టుపెట్టింది. ఈ మొత్తం సంఘటనతో పాకిస్థాన్ కి చెందిన సినీనటుల్ని మన సినిమాల్లోకి తీసుకోకూడదనే అల్టిమేటం జారీ అయ్యింది. పాకిస్థాన్ నటులు నటించిన మన సినిమాలని కూడా ఇండియాలో రిలీజ్ కాకుండా బ్యాన్ చేసారు. ఈ కోవలోనే పాకిస్థాన్ నటులు నటించిన కొన్ని హిందీ సినిమాలు రిలీజ్ కాలేదు.

రీసెంట్ గా 'సర్ధార్ జి 3'(Sardaar Ji 3)అనే పంజాబీ చిత్రం యొక్క ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దిల్జిత్ ధోసాంజె(diljit dosanjh) హీరోగా చేస్తున్న ఈ మూవీలో పాకిస్థాన్ నటి 'హనీయ అమీర్'(Hania Aamir)హీరోయిన్ గా చేసింది. రిలీజ్ డేట్ కూడా ప్రకటించడంతో, పాకిస్థాన్ నటి సినిమాని ఎలా రిలీజ్ చేస్తారని మేకర్స్ పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ అధ్యక్షుడు 'బిఎన్ తివారి' మాట్లాడుతు దిల్జిత్ తో పాటు నిర్మాతలపై నిషేధం విషేధించేలా మార్గ నిర్దేశకం చేయనున్నట్టుగా తెలిపారు.

నిర్మాత 'గన్ బీర్ సింగ్ సిద్దు' మాట్లాడుతు భారత్, పాకిస్థాన్ కి మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తనప్పుడు ఈ చిత్రం ప్రారంభమయ్యింది. భారతీయుల మనోభావాల్ని దృష్ఠ్టిలో ఉంచుకొని ఇండియాలో రిలీజ్ చెయ్యడం లేదని తెలిపాడు. ఇక విమర్శలు తార స్థాయికి చేరడంతో ట్రైలర్ ని చిత్ర యూనిట్ తొలగించింది.