English | Telugu

ఫైటర్‌ మోడ్‌ ఆన్‌ చేసిన అనిల్‌ కపూర్‌!

ఏరియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ఫైటర్‌' కోసం అనిల్‌ కపూర్‌ రెడీ అవుతున్నారు. హృతిక్‌ రోషన్‌, దీపిక పదుకోన్‌ జంటగా నటిస్తున్న సినిమా ఫైటర్‌. ఈ సినిమాకు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. కొన్ని పిక్స్, వీడియోస్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు అనిల్‌ కపూర్‌. ఏరియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫైటర్‌ కోసం ట్రైనింగ్‌ అవుతున్నట్టు పోస్ట్ చేశారు. ఈ వీడియోల్లో అనిల్‌ ట్రెడ్‌మిల్‌లో పరుగెత్తుతున్నారు. బ్లూ ఆక్సిజన్‌ మాస్క్ పెట్టుకుని ఆయన ట్రెడ్‌మిల్‌ చేస్తున్న తీరు కొత్తగా అనిపించింది. అనిల్‌కి ఇప్పుడు 66 ఏళ్లు. ఆయన్ని ఫిట్‌నెస్‌ విషయంలో చాలా మంది రోల్‌మోడల్‌గా తీసుకుంటారు. నీతు కపూర్‌, రోహిత్‌ సురేష్‌ సరఫ్‌, జాకీ ష్రాఫ్‌, హ్యూమా ఖురేషీ, ఫాతిమా సనా షేక్‌ లాంటివారందరూ ఆయన డెడికేషన్‌ చూసి ఫిదా అవుతున్నారు. ఒక రోల్‌లో పర్ఫెక్ట్ గా ఫిట్‌ కావాలంటే, ఇన్ని రకాలుగా కష్టపడాలా అంటూ ఇన్‌స్పయర్‌ అవుతున్నారు.

అనిల్‌ కపూర్‌ మాత్రమే కాదు, హృతిక్‌ రోషన్‌ కూడా తన రోల్‌కి ఎలా ప్రిపేర్‌ అవుతున్నారో కొన్ని పిక్స్ షేర్‌ చేశారు. తన కండరాలను ఎలా బలిష్టంగా చేశారో అందులో చూపించారు. ఫిట్‌నెస్‌, నిద్ర, డైట్‌ని ఎలా సమన్వయం చేసుకున్నారో అందులో చెప్పుకొచ్చారు హృతిక్‌ రోషన్‌. మెడిటేషన్‌ కూడా చేస్తున్నానని అన్నారు. దాదాపు గంట సేపు చేసే మెడిటేషన్‌ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని తెలిపారు హృతిక్‌. నిద్ర, డైట్‌ విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలిపారు.

ఫైటర్‌ ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. బ్యాంగ్‌ బ్యాంగ్‌, వార్‌ తర్వాత సిద్ధార్థ్‌ ఆనంద్‌తో కలిసి మూడో సారి పనిచేస్తున్నారు హృతిక్‌ రోషన్‌. 2024 జనవరి 25న విడుదల కానుంది ఫైటర్‌.