English | Telugu

షారుఖ్ - స‌ల్మాన్ సీన్ ఐడియా ఎవ‌రిదో తెలుసా?

ప‌ఠాన్ సినిమాలో షారుఖ్ - స‌ల్మాన్ క‌లిసి శ‌త్రువుల‌ను తుద‌ముట్టించేస్తారు. ఆ త‌ర్వాత వారిద్ద‌రూ క‌లిసి కూర్చుని నెక్స్ట్ జ‌న‌రేష‌న్ గురించి, బాక్సాఫీస్ రికార్డుల గురించి మాట్లాడుకుంటుంటారు. ప‌ఠాన్ సినిమా గురించి ఎంత మంది మాట్లాడుకున్నారో, ఈ సీన్ గురించి అంత మంది మాట్లాడుకున్నారు. అయితే ఈ సినిమా ఫైన‌ల్ క‌ట్‌లో ఈ సీన్ లేనే లేద‌ట‌. ఉద‌య్ చోప్రా స‌జెష‌న్ మేర‌కే ఈ సీన్‌ని లాస్ట్ లో పెట్టార‌ట‌.

షారుఖ్ హీరోగా న‌టించిన సినిమా ప‌ఠాన్‌. దీపిక ప‌దుకోన్ హీరోయిన్‌గా న‌టించారు. సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆయ‌న మాట్లాడుతూ ``పోస్ట్ క్రెడిట్స్ సీక్వెన్స్ గురించి చాలా మంది మాట్లాడారు. యాక్చువ‌ల్‌గా వీరిద్ద‌రినీ ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకు వ‌చ్చే షాట్ మీద చాలా వ‌ర్కవుట్ చేశాం. వారిద్ద‌రి మ‌ధ్య మంచి కెమిస్ట్రీ ఉంటుంది. ఆఫ్ స్క్రీన్ కూడా వారిద్ద‌రూ స‌ర‌దాగా ఉంటారు. ఇద్ద‌రూ క‌లిసిన‌ప్పుడు చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది. హిందీ సినిమా ఆడియ‌న్స్ కి వారిద్ద‌రూ క‌ర‌ణ్ - అర్జున్‌గా బాగా తెలుసు. ఆ కెమిస్ట్రీని రీక్రియేట్ చేయాల‌నే ఉద్దేశంతోనే ఈ సినిమాలో వారిద్ద‌రికీ మ‌ధ్య స‌న్నివేశాన్ని ప్లాన్ చేశాను. అయితే అంత‌కు మించి ఇంకేదో కావాల‌నిపించి, కామెడీ డైలాగుల‌ను పెట్టాను. ముందు వాటికి షారుఖ్ ఏమంటారో అని అనుకున్నా. అయితే ఆయ‌న ఐడియా చెప్ప‌గానే ఒప్పుకున్నారు. సీన్ తీసేశాం. కానీ మ‌రీ లెంగ్త్ ఎక్కువైంది. అందుకే క‌ట్ చేసి ప‌క్క‌న‌పెట్టేశాం. చివ‌ర‌గా ఉద‌య్ చోప్రా మొత్తం సినిమా చూశారు.

వాళ్ల మీద తీసిన సీన్‌ని ఎక్క‌డ పెట్టావ‌ని అడిగారు. లెంగ్త్ ఎక్కువ‌యింద‌ని, ప‌క్క‌న‌పెట్టేశాన‌ని చెప్పాను. రోలింగ్ టైటిల్స్ త‌ర్వాత యాడ్ చేయ‌మ‌ని మాకు స‌ల‌హా ఇచ్చారు. థియేట‌ర్ల‌లో రెస్పాన్స్ చూసి మ‌తిపోయింది. ఇప్పుడు స‌ల్మాన్‌, షారుఖ్ క‌లిసి టైగ‌ర్‌3లో న‌టిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది దివాలికి విడుద‌ల కానుంది. ఈ సినిమా కోసం షారుఖ్‌ఖాన్ ఏడు రోజులు షూటింగ్ చేశారు. మాసివ్ యాక్ష‌న్ సీక్వెన్స్ ని షూట్ చేశారు మేక‌ర్స్. ఈ చిత్రంలో షారుఖ్‌, స‌ల్మాన్‌తో పాటు క‌త్రినాకైఫ్ న‌టిస్తున్నారు. ఆమె జోయా పాత్ర‌లో క‌నిపిస్తారు. స‌ల్మాన్‌కి శ‌త్రువుగా క‌నిపిస్తారు ఇమ్రాన్ హ‌ష్మి. భార‌త‌దేశంలో ఇప్ప‌టిదాకా వెయ్యి కోట్ల‌ను దాటిన సినిమాలు ఐదున్నాయి. వాటిలో ప‌ఠాన్ కూడా ఒక‌టి. కింగ్ ఖాన్ ఈజ్ బ్యాక్ అని అంటున్నారు ఆడియ‌న్స్.