English | Telugu

షారుఖ్‌కి జరిగింది సల్మాన్‌కి రిపీట్‌ అవుతుందా?

కొన్ని మాటలను తెలిసి అన్నా, తెలియకుండా అన్నా.. అవి జస్ట్ అలా ట్రెండ్‌ అయిపోతుంటాయి. రీసెంట్‌గా షారుఖ్‌ విషయంలోనూ అలాంటిదే జరిగింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత షారుఖ్‌ఫుల్‌ప్లెడ్జ్ డ్‌గా స్క్రీన్‌ మీదకు వచ్చారనే ప్రచారం గట్టిగా జరిగింది. నాలుగేళ్ల తర్వాత స్క్రీన్‌ మీదకు వచ్చిన షారుఖ్‌కి పఠాన్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయింది. ఇప్పుడు బాలీవుడ్‌ బాయీజాన్‌ సల్మాన్‌ ఫ్యాన్స్ కూడా అలాంటి లాజిక్కే లాగే ప్రయత్నం చేస్తున్నారు. సల్మాన్‌ భాయ్‌ సినిమా ఈద్‌కి ఫుల్‌ప్లెడ్జ్ డ్‌గా రిలీజ్‌ అయి నాలుగేళ్లయిందనేది అభిమానుల మాట. అంటే షారుఖ్‌కి నాలుగేళ్ల గ్యాప్‌ కలిసొచ్చినట్టు సల్మాన్‌ ఖాన్‌కి కూడా కలిసొస్తుందా? అనే మాటలు వినిపిస్తున్నాయి.

నార్త్ సినిమాలో సౌత్‌ కల్చర్‌ అంటూ సరికొత్తకొలాబరేషన్‌ని కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌ సినిమాతో స్టార్ట్ చేశారు సల్మాన్‌ ఖాన్‌. ఈ సినిమాలో పూజా హెగ్డే, వెంకటేష్‌ కీ రోల్స్ చేశారు. రామ్‌చరణ్‌ గెస్ట్ రోల్‌లో నటించారు. కాసీ కా భాయ్‌ కీసీ కీ జాన్‌ సినిమా ఈ ఈద్‌ సందర్భంగా అంటే ఈ నెల 21న విడుదలకానుంది. ఈద్‌ సందర్భం సల్మాన్‌ఖాన్‌కి చాలా స్పెషల్‌. ఆయన నటించిన రాధే 2021లో ఈద్‌కే విడుదలైంది. కానీ అప్పుడు అది డిజిటల్‌ రిలీజ్‌ అయింది. దానికి తోడు కొన్ని థియేటర్లలో మాత్రమే రాధే విడుదలైంది.

అంతకు ముందు 2019లో విడుదలైంది దబాంగ్‌ 3. 2021లో విడుదలైన అంతిమ్‌ ఈద్‌ రిలీజ్‌ కాదు. గత కొన్నాళ్లుగా తన పిక్స్ ని ఇంట్రస్టింగ్‌ కేప్షన్స్ తో పోస్ట్ చేస్తున్నారు సల్మాన్‌ ఖాన్‌. కిసీకా భాయ్‌ కీసీ కీ జాన్‌లో సల్మాన్‌ - పూజా మధ్య సాగే సరదా కాన్వర్జేషన్‌ కూడా జనాలను మెస్మరైజ్‌ చేసింది. నీపేరేంటి అని పూజా హెగ్డే అడిగినప్పుడు 'నాకు పర్టిక్యులర్‌ పేరంటూ లేదు. నన్నందరూ భాయిజాన్‌ అంటారు' అంటూ సల్మాన్‌ చెప్పిన డైలాగులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తన టైగర్‌ రిలీజ్‌కన్నా ముందు కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌ సినిమా హిట్‌ కావాలని అనుకుంటున్నారట సల్మాన్‌ఖాన్‌. దానికి ఇప్పుడు నాలుగేళ్ల సెంటిమెంట్‌ తోడైందని అంటున్నారు జనాలు