English | Telugu

Guppedantha Manasu: గుప్పెడంత మనసులో కొత్త ట్విస్ట్.. విశ్వనాథ్ ఇంటికి అనుపమ!

 స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -914 లో.. వసుధార, రిషి ఇద్దరు విష్ కాలేజీకీ వెళ్ళడానికి హాల్లోకి వస్తారు. అక్కడే ఉన్న మహేంద్రకి విష్ కాలేజీకి వెళ్తున్నాము. మీరు రండి అని మహేంద్రతో వాళ్ళిద్దరు అనగానే.. నేను రాలేను, మీరు వెళ్ళండి. నా గురించి టెన్షన్ పడకండి. నేను ఎక్కడికి వెళ్ళను డ్రింక్ కూడా చెయ్యనని మహేంద్ర చెప్తాడు. మామయ్య మీరు మన కాలేజీ కీ వెళ్ళండని వసుధార అనగానే.. నేను వెళ్ళను అక్కడకి వెళ్తే జగతి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని మహేంద్ర అంటాడు.

కొడుకు సాంగ్ ని రిక్రియేట్ చేసిన సుమ

యాంకర్ సుమ మంచి జోష్ మీద ఉంది. తన కొడుకు రోషన్ కనకాల నటించిన మూవీ  బబుల్‌గమ్ త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది.  తాజాగా ఒక భారీ ఈవెంట్‌ ని నిర్వహించి బబుల్ గమ్‌ యొక్క టీజర్ ను విడుదల కూడా చేశారు. ఈ ఈవెంట్ ని సుమ హోస్ట్ చేసింది. అలాగే రోషన్ కనకాల కూడా బుల్లితెర మీద వచ్చే షోస్ ద్వారా కనిపిస్తూ తనని తానూ ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఇక రోషన్ అలా ఉంటే సుమ మరో పక్క తన కొడుకు మూవీలోని సాంగ్ కి డాన్స్ వేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఛిల్ల్ అవుతోంది. "బబుల్ గం" మూవీలో "హబీబి" అనే సాంగ్ కి తన పక్కన నలుగురు అసిస్టెంట్స్ ని పెట్టుకుకుని ఆ సాంగ్ ని రి క్రియేట్ చేసి డాన్స్ స్టెప్స్ వేసింది.