English | Telugu
Brahmamudi:తాతయ్యకు క్యాన్సర్.. మీరు ఇంట్లో నుండి వెళ్లిపోండి!
Updated : Nov 7, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -247 లో.. ఇంటిపెద్ద ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. అది ఎవరికి నచ్చిన నచ్చకపోయిన అందరూ అంగీకరించక తప్పదని ఇందిరాదేవి అందరిని హెచ్చరిస్తుంది. నేను మాట్లాడాలంటూ రాహుల్ మధ్యలో కలుగుజేసుకొని మాట్లాడుతాడు.
నేను ఇప్పటి వరకు చాలా తప్పులు చేశాను. స్వప్న ని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాను కానీ మీ అందరూ పెళ్లికి ఒప్పుకున్నాక స్వప్నని పెళ్లి చేసుకొని ఇన్ని రోజులు తనకి కష్టం తెలియకుండా చూసుకున్నాను కానీ అలాంటి నన్ను ఈ కుటుంబాన్ని స్వప్న మోసం చేసింది. ఇక తనని నా భార్యగా ఒప్పుకోను తాతయ్య. మాకు విడాకులు ఇప్పించండని రాహుల్ అనగానే అందరూ షాక్ అవుతారు. మరొక వైపు అపర్ణ కలుగుజేసుకొని స్వప్నతో పాటు కావ్య కూడా తప్పు చేసింది. ఇద్దరిని ఇంట్లో నుండి పంపించాలని అంటుంది.
ఆ తర్వాత రుద్రాణి మీ అక్క చెల్లెలు. ఇక్కడ నుండి వెళ్లిపోండని అంటుంది. ఇక్కడ నుండి వెళ్ళేది లేదు. మమ్మల్ని బయటకు పంపిస్తే అందరిని బయటకు లాగుతాను. మీకు సపోర్ట్ చేసేవాళ్ళని కూడా అని స్వప్న అనగానే.. సుభాష్ ఒక్కసారిగా ఆపండి అంటూ అరుస్తాడు. స్వప్నది ఎంత తప్పు ఉందో, రాహుల్ ది కూడా అంతే తప్పు ఉంది. రుద్రాణిది కూడా తప్పు ఉంది. కాబట్టి మీరు అందరూ ఇంట్లో నుండి వెళ్లిపోండని సుభాష్ అనగానే.. మేమ్ ఎందుకు వెళతామని రుద్రాణి అడుగుతుంది. మేమ్ వెళ్ళిపోతాం మా ఆస్తి మాకు ఇవ్వండి అని స్వప్న అనగానే.. మీ ఆస్తి ఎక్కడిది నీ పుట్టింటి నుండి నువ్వు ఏమైనా తెచ్చావా? నీ అత్త ఏమైనా తెచ్చిందా అని అపర్ణ అడుగుతుంది.. మాకు ఆస్తి లేదా? మా నాన్న మమ్మల్ని చూసుకుంటానని బాధ్యత తీసుకున్నారు చెప్పండి నాన్న అని సీతారామయ్యని రుద్రాణి అడుగుతుంది.
ఆ తర్వాత సితారామయ్య కళ్ళు తిరిగి పడిపోబోతుంటే రాజ్ పట్టుకుంటాడు. ఆస్తి అడిగేసరికి ఇదొక నాటకమని రుద్రాణి అనగానే రాజ్ కోపంగా సీతారామయ్యకి ఉన్న క్యాన్సర్ గురించి చెప్పగానే అందరు షాక్ అవుతారు. నేను ఉండగానే నా కుటుంబం ముక్కలు అవుతుందని సీతారామయ్యు బాధపడుతుంటాడు. ఇందిరాదేవి అందరికి ఈ కుటుంబం నుండి ఎవరు ఎక్కడికి వెళ్లిపోవాల్సిన అవసరం లేదని చెప్తుంది. ఇక చేసేదేమీ లేక అందరూ ఒప్పుకుంటారు. ఆ తర్వాత రాజ్ కావ్యల చెయ్యి తీసుకొని ఇక నుండి అయిన కావ్యని భార్యగా ఒప్పుకోమని చెప్తాడు సీతారామయ్య. దానికి రాజ్ మౌనంగా ఉంటాడు. రాజ్ దగ్గరకి కావ్య రాగానే రాజ్ వెళ్లిపోతుంటే గొడవ పడిన ప్రతిసారి మాట్లాడకుండా ఉంటే బంధం ఎలా నిలబడుతుందని కావ్య అనగానే.. వద్దని అనుకున్నప్పుడు బంధం నిలబడినా, తెగిపోయిన ఒకటే అవుతుందని చెప్పి రాజ్ వెళ్ళిపోతాడు. మరి కావ్యని రాజ్ క్షమించగలడా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.