English | Telugu

'అనగనగా ఒక రాజు' సినిమా సంక్రాంతి పండుగలా ఉంటుంది: నవీన్‌ పొలిశెట్టి

Publish Date:Jan 13, 2026

  మూడు వరుస ఘన విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నవీన్‌ పొలిశెట్టి.. ఈ సంక్రాంతికి 'అనగనగా ఒక రాజు'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. సంక్రాంతి కానుకగా 2026, జనవరి 14న థియేటర్లలో అడుగుపెడుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. రేపు 'అనగనగా ఒక రాజు' థియేటర్లలో అడుగుపెడుతున్న నేపథ్యంలో.. తాజాగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. (Anaganaga Oka Raju)   ఈ సందర్భంగా నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ.. "మన తెలుగువారికి సంక్రాంతి అనేది ప్రత్యేకమైన పండుగ. ఎన్ని బాధలున్నా అవన్నీ మర్చిపోయి మన వాళ్ళను కలుసుకొని సంతోషంగా ఉంటాం. ఒత్తిడిని పక్కన పెట్టి, పిండి వంటలు తింటూ, నలుగురితో నవ్వుకుంటూ చాలా సరదాగా ఉంటాం. అలాంటి ఎనర్జీనే 'అనగనగా ఒక రాజు'లో చూడబోతున్నారు. మన ఒత్తిడిని దూరం చేసి, హాయిగా నవ్వించేలా సినిమా ఉంటుంది. ట్రైలర్ కి మీ నుంచి వచ్చిన అద్భుతమైన స్పందన.. సినిమాపై మా నమ్మకాన్ని రెట్టింపు చేసింది. ట్రైలర్ లో ఉన్న జోక్స్ ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఒక పర్ఫెక్ట్ పండగ సినిమాలా ఉంది, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఉంది, చాలా చాలా బాగుంది అంటూ అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పటికే బుకింగ్స్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ప్రీ సేల్స్ తోనే నా గత చిత్రాల ఓపెనింగ్స్ ని దాటేసింది. మీరు ఈ సినిమాపై చూపుతున్న ఆసక్తికి తగ్గట్టుగానే.. మిమ్మల్ని అలరించేలా ఈ సినిమా ఉంటుంది." అన్నారు.   కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. "మేమందరం ఎంతో కష్టపడి పని చేసి.. ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాము. ఈ సినిమాపై మీ స్పందన కోసం మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. మీరు ఈ సినిమా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. మీ కుటుంబంతో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. హాయిగా నవ్వుకుంటూ.. ఈ సంక్రాంతి పండుగను జరుపుకోండి." అన్నారు.   చిత్ర దర్శకుడు మారి మాట్లాడుతూ.. "సినిమా చాలా బాగా వచ్చింది. పర్ఫెక్ట్ ఫెస్టివల్ ఎంటర్టైనర్ ఇది. సంక్రాంతి అనేది తెలుగు ప్రజలకు ప్రత్యేకమైన పండుగ. సంక్రాంతి అనేది తెలుగువారికి ఒక ఎమోషన్. సంక్రాంతి కానుకగా మా సినిమా విడుదలవుతుండటం సంతోషంగా ఉంది. ఈ పండగకు మీ కుటుంబంతో కలిసి చూసి హాయిగా నవ్వుకునే క్లీన్ ఎంటర్టైనర్ ఇది. జనవరి 14న కుటుంబంతో కలిసి థియేటర్ కి వెళ్ళి.. మీ బాధలన్నీ మర్చిపోయి రెండున్నర గంటల పాటు మనస్ఫూర్తిగా నవ్వుకోండి. రాజు గారితో ఈ పండగను ఎంజాయ్ చేయండి." అన్నారు.   నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. "గోదావరి నేపథ్యంలో జరిగే ఒక అందమైన కథతో ఈ సినిమా రూపొందింది. నవీన్ శైలిలో చాలా సరదాగా సినిమా ఉంటుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే పొలిటికల్ సెటైర్ ఎపిసోడ్ కూడా ఇందులో ఉంటుంది. సినిమా ఎంత నవ్విస్తుందో.. అదే సమయంలో చివరిలో ఒక మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. కామెడీ, ఎమోషన్, ఫైట్, పాటలు ఇలా అన్ని అంశాలతో తెరకెక్కిన పండగ సినిమా ఇది." అన్నారు.    

Anaganaga Oka Raju team promises a wholesome family entertainer

Publish Date:Jan 13, 2026

Releasing this Sankranthi amid high expectations, Anaganaga Oka Raju is a true festive entertainer. The film stars star entertainer Naveen Polishetty, who has carved a special place in the hearts of audiences with three consecutive blockbusters. It is produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under the banners of Sithara Entertainments and Fortune Four Cinemas, and presented by Srikara Studios. The film is directed by debutant Mari, with Meenakshi Chaudhary as the female lead and music composed by Mickey J. Meyer. From the very beginning, the film’s promotional content stood out for its freshness and caught audience attention. Set to deliver a complete entertainment feast this Sankranthi, Anaganaga Oka Raju is releasing in theatres on January 14, 2026. The recently released trailer doubled expectations, and as the film gears up for its theatrical release, the team held a pre-release press meet. Speaking at the press meet, Naveen Polishetty said, “First of all, Sankranthi greetings to everyone. For us Telugu people, Sankranthi is a very special festival. No matter how many problems we have, we forget them all, meet our loved ones, and spend time happily together. We put stress aside, enjoy festive food, laugh with everyone, and have a great time. That same energy is what you’ll see in Anaganaga Oka Raju. The film is designed to take away your stress and make you laugh freely. The amazing response you gave to the trailer doubled our confidence in the film. The jokes from the trailer went viral on social media. We received feedback from all sections saying it feels like a perfect festival film, a complete family entertainer, and that it’s very, very good. Bookings are already getting an excellent response. Especially overseas, the pre-sales alone have crossed the opening numbers of my previous films. Matching the interest you’re showing, the film will definitely entertain you to the fullest.” Heroine Meenakshi Chaudhary said, “All of us have worked extremely hard and are coming before you with a good film. We’re eagerly waiting for your response. You will definitely enjoy the film and keep laughing throughout. Please watch it with your family and enjoy. Laugh freely and celebrate this Sankranthi happily.” Director Maari said, “The film has turned out really well. It’s a perfect festival entertainer. Sankranthi is a special festival for Telugu people. It’s an emotion for us. We’re very happy to release our film as a Sankranthi gift. This is a clean entertainer you can watch with your family and laugh freely. On January 14, go to the theatre with your family, forget all your worries, and laugh wholeheartedly for two and a half hours. Celebrate this festival with Raju.” Producer Suryadevara Naga Vamsi said, “The film is based on a beautiful story set against the Godavari backdrop. In Naveen’s style, it’s filled with a lot of fun. There’s also a political satire episode set in a rural backdrop. While the film will make you laugh a lot, it also carries a strong emotional high towards the end. Comedy, emotion, action, songs – this is a festival film made with all the elements.” Child actor Revanth said, “Thanks to Sithara Entertainments and Naveen garu for giving me such a great opportunity. I played a very good role in the film and appear in both the first and second halves. You’ll laugh a lot watching the movie. Please come to the theatre on January 14 and watch it.” Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

తన కథలతో అన్ని భాషల్లోనూ సూపర్‌హిట్స్‌ ఇచ్చిన డైరెక్టర్‌!

Publish Date:Jan 7, 2026

(జనవరి 7 కె.భాగ్యరాజా పుట్టినరోజు సందర్భంగా..) ప్రస్తుతం హీరోలను బట్టి కథలు తయారు చేస్తున్నారు. ఒక హీరోకి ఎంత మార్కెట్‌ ఉంది, ఎలాంటి ఇమేజ్‌ ఉంది అనేది ప్రధానంగా చూస్తున్నారు. కానీ, కానీ,  పాత రోజుల్లో మొదట కథ అనుకొని దాన్ని పూరిస్థాయిలో సిద్ధం చేసిన తర్వాత ఆ కథకు ఏ హీరో అయితే సూట్‌ అవుతాడు అనేది ఆలోచించేవారు. 1980కి ముందు సినిమాలు ఈ విధంగానే రూపొందేవి. ఆ తర్వాత హీరోని బట్టి కథలు చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో కూడా కథను నమ్ముకొని సినిమాలు చేసిన దర్శకనిర్మాతలు ఉన్నారు. వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వారు కె.భాగ్యరాజా.    ఎన్నో అద్భుతమైన సినిమాలకు రూపొందించి భారతదేశంలోనే అత్యుత్తమ కథా రచయితగా పేరు తెచ్చుకున్న దర్శకుడు కె.భాగ్యరాజ్‌. ఆయన తన సినిమాల్లోని కథకు, కథనానికి ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు. తమిళ్‌లో ఆయన రూపొందించిన ఎన్నో సినిమాలు వివిధ భాషల్లో రీమేక్‌ అయ్యాయి. ఆయన రచించి దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎక్కువ శాతం కుటుంబకథా చిత్రాలే కావడం విశేషం.    1953 జనవరి 7న తమిళనాడులోని వెల్లన్‌ కోయిల్‌లో కృష్ణస్వామి, అమరావతియమ్మ దంపతులకు జన్మించారు కృష్ణస్వామి భాగ్యరాజ్‌. చిన్న తనం నుంచి సినిమాలపైన ఆసక్తి పెంచుకున్న భాగ్యరాజ్‌ తను చూసిన సినిమాల గురించి ఎప్పటికప్పుడు విశ్లేషించేవారు. అంతకంటే బాగా కథ ఎలా రాయాలో స్నేహితుల దగ్గర డిస్కస్‌ చేసేవారు. సినిమాల్లో పనిచేయాలనే ఆసక్తి ఆయనకు బాగా ఉండేది. అలా గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తర్వాత సినీ రంగ ప్రవేశం చేశారు. మొదట భారతీరాజా దగ్గర సహాయకుడిగా పనిచేశారు. భారతీరాజా రూపొందించిన అనేక సినిమాలకు స్క్రీన్‌ప్లే సమకూర్చారు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. 1979లో వచ్చిన సువరిల్లధ చిత్తిరంగళ్‌ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత రచయితగా, దర్శకుడిగానే కాకుండా హీరోగా కూడా నటించారు. స్వీయ దర్శకత్వంలో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించారు. ఆయన సినిమాలు ఎక్కువగా తెలుగులో రీమేక్‌ అయ్యాయి.    1980 నుంచి 1990 వరకు భాగ్యరాజ్‌ చేసిన సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ఆయన సినిమాల్లోని కథ, కథనాలు వారిని ఆకట్టుకునేవి. ఒక దశలో కె.భాగ్యరాజ్‌ సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూసేవారు. ఆయన సినిమాల్లోకి వచ్చిన కొంతకాలానికి 1981లో ప్రవీణ అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. అయితే 1983లో ఆమెకు కామెర్ల వ్యాధి సోకి మరణించారు. ఆ తర్వాత తన సహనటి పూర్ణిమా జయరామ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు శంతను భాగ్యరాజ్‌, కుమార్తె శరణ్య భాగ్యరాజ్‌ ఉన్నారు. వీరు కూడా కొన్ని సినిమాల్లో నటించారు. భాగ్యరాజ్‌ సినిమాలు విలక్షణమైన కథలతో ఉంటాయి. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేవిగా కూడా ఉంటాయి. అతని స్క్రీన్‌ప్లేకి ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. దానితోనే ఆయన ఎక్కువ విజయాలు సాధించారు.   1987లో తమిళ్‌లో రూపొందిన ఎంగ చిన్న రాసా చిత్రం చాలా పెద్ద హిట్‌ అయింది. ఆ తర్వాత అదే సినిమాను చిన్నరాజా పేరుతో తెలుగులో డబ్‌ చేసి విడుదల చేశారు. 1992లో ఎంగ చిన్నరాసా చిత్రాన్ని హిందీలో బేటా పేరుతో రీమేక్‌ చేశారు. 1993లో అబ్బాయిగారు పేరుతో ఆ సినిమాను ఇ.వి.వి.సత్యనారాయణ రీమేక్‌ చేశారు. ఇలా ఆయన చేసిన ఎన్నో సినిమాలు వివిధ భాషల్లో రీమేక్‌ అయ్యాయి. అలా ఎక్కువ రీమేక్‌ అయిన సినిమాలు భాగ్యరాజ్‌వి కావడం విశేషం. తను డైరెక్ట్‌ చేసిన సినిమాల్లోనే కాక ఇతర దర్శకులు రూపొందించిన సినిమాల్లోనే భాగ్యరాజ్‌ ఎక్కువగా నటించారు. ఇటీవలి కాలంలో అడపా దడపా కొన్ని సినిమాల్లో కనిపిస్తున్నారు. తమిళ టీవీ ఛానల్స్‌ నిర్వహించే పలు షోలకు, సీరియల్స్‌కు స్క్రిప్ట్‌ అందించడమే కాకుండా ఆ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు కె.భాగ్యరాజ్‌.

విడాకులు అనౌన్స్ చేసిన స్టార్ కపుల్.. ముగ్గురు పిల్లల విషయంలో కీలక నిర్ణయం 

Publish Date:Jan 5, 2026

        -భారతీయ మీడియా వర్గాల్లో మరో సంచలనం  -16 ఏళ్ళ వివాహ బంధానికి గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఏంటి -సోషల్ మీడియా వేదికగా  మహి విజ్ చేసిన పోస్ట్ ఏంటి -మరి ముగ్గురు పిల్లల పరిస్థితి ఏంటి!       ఈ మధ్య కాలంలో భార్యా, భర్తలైన సినీ, టీవీ సెలబ్రటీలు పోటాపోటీగా విడాకులు తీసుకుంటున్నారు. కొత్తగా వివాహ బంధంలోకి అడుగుపెట్టినా వాళ్లే కాకుండా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న వాళ్ళు సైతం విడాకులు ప్రకటిస్తు ఉండటం అభిమానులని కలవర పరుస్తు ఉంది. రీసెంట్ గా మరో  సెలబ్రటీ కపుల్ డైవర్స్ తో తమ పదహారు సంవత్సరాల వివాహ బంధానికి సెండ్ ఆఫ్ చెప్పి అభిమానులకి కలవర పాటుకి గురి చేసింది.   మహి విజ్, జై భానుషాలి.. బాలీవుడ్ సినీ,టీవీ రంగంలో సుదీర్ఘ కాలం నుంచి తిరుగులేని ఆది పత్యాన్ని చెలాయిస్తూ వస్తున్నారు. 2011 లో ఈ ఇద్దరి వివాహం జరగగా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. రీసెంట్ గా మహి విజ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా విడాకులపై స్పందిస్తు 'ఇద్దరం విడిపోయినా  కూడా పిల్లలు తారా, ఖుషి, రాజ్‌వీర్‌ల కోసం మంచి తల్లిదండ్రులుగా, మంచి స్నేహితులుగా ఉండేందుకు ప్రయత్నిస్తాం. మేము వేరు దారుల్లో నడుస్తున్నా విడాకుల  నిర్ణయం వెనుక ఎలాంటి నెగిటివిటీ,డ్రామా లేదు. కేవలం ప్రశాంతత కోసమే విడాకుల నిర్ణయాన్ని ఎంచుకున్నాం..స్నేహబంధం కొనసాగుతూనే  ఒకరిని ఒకరం గౌరవించుకునే విషయంలో రాజీ పడం. ఈ సమయంలో అభిమానుల ప్రేమ, గౌరవం, దయ అవసరం అని తెలిపింది.     Also read:  ధురంధర్ తో కొత్త లోక  కలిస్తే.. మీకు ఓకేనా!     పదిహేడు సంవత్సరాల వయసులో మోడలింగ్ గా కెరీర్ ప్రారంభించిన మహి విజ్ టెలివిజన్   రంగంలో సుమారు 30 సిరీస్ ల వరకు చేసింది. గత ఏడాది డిసెంబర్ 2 నుంచి కలర్స్ టీవీ లో వస్తున్న సెహర్-హోనే కో హై లో చేస్తుంది. సినిమాల విషయానికి వస్తే 2004 లో తెలుగులో ప్రభు దేవా హీరోగా వచ్చిన తపన అనే మూవీలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత మలయాళంలో, కన్నడంలో ఒక సినిమా చేసింది. ఇక  జై భానుషాలి విషయానికి వస్తే తను కూడా మోడల్ గానే  కెరీర్ స్టార్ట్ చేసి సినీ, టీవీ, వెబ్ సిరీస్  నటుడుగా, అనేక షోస్ కి ప్రెజంటర్ గా చేస్తు తనదైన శైలిలో దూసుపోతున్నాడు. లాస్ట్ ఇయర్ మార్చిలో అభిషేక్ బచ్చన్ నుంచి వచ్చిన బి హ్యాపీ అనే మూవీలో కీలకమైన క్యారక్టర్ లో కనిపించాడు.  

Brahmamudi : అక్క డెలివరీకి బావని వెళ్ళొద్దని ఆపేసిన చెల్లి!

Publish Date:Jan 13, 2026

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -928 లో......మినిస్టర్ భార్య డెలివరీకి హాస్పిటల్ లో అడ్మిట్ అవుతుంది. మినిస్టర్ టెన్షన్ పడుతుంటే డాక్టర్ ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత డాక్టర్ కావ్య దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్లేసరికి కావ్య తన గది లోపల ఉండదు. అదే విషయం బయటకు వచ్చి అపర్ణ వాళ్ళకి చెప్తుంది. వాళ్ళు షాక్ అవుతారు. వదిన అన్నయ్య దగ్గరికి వెళ్లి ఉంటుంది. నేను వెళ్లి తీసుకొని వస్తానని కళ్యాణ్ వెళ్తాడు. మరొకవైపు స్టేషన్ లో ఉన్న రాజ్ దగ్గరికి కావ్య వస్తుంది. తనని చూసి నువ్వు ఎందుకు వచ్చావని అడుగుతాడు. నాకు డెలివరీ అయ్యే టైమ్ లో నా పక్కనే ఉంటానని మాటిచ్చారు. నా పక్కన ఉండాలిసిందేనని కావ్య అంటుంది. కావ్య వెళ్లి ఇన్‌స్పెక్టర్ ని రిక్వెస్ట్ చేస్తుంది. వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడే కళ్యాణ్ వచ్చి కావ్యని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. డాక్టర్ కావ్యకి ట్రీట్ మెంట్ ఇస్తుంది. డాక్టర్ బయటకు వచ్చి అపర్ణ వాళ్ళపై కోప్పడుతుంది. మేము కావ్య పరిస్థితి ఏంటో చెప్తున్నాం అయిన మీరు తనకి నచ్చచెప్పడం లేదని అంటుంది. ఆ తర్వాత రాజ్ కానిస్టేబుల్ ని రిక్వెస్ట్ చేసి ఫోన్ తీసుకుంటాడు. కళ్యాణ్ కి ఫోన్ చేసి.. నేను న్యాయంగానే స్టేషన్ నుండి బయటకు వద్దామనుకున్న కానీ కావ్య పరిస్థితి చూసి రాక తప్పడం లేదు. నువ్వు స్టేషన్ కి ఫోన్ చేసి నేను చెప్పమన్నట్లు చెప్పు అని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో రాజ్ స్టేషన్ నుండి తప్పించుకొని హాస్పిటల్ కి వెళ్తాడు. రాజ్ వెళ్లకుండా అప్పు ఆపుతుంది. నేను రూల్స్ బ్రేక్ చెయ్యనని అప్పు అనగానే.. నువ్వు మమ్మల్ని దాటుకొని వాడిని ఎలా వెళ్లానివ్వవో చూస్తానని అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

NBK 111: బాలయ్య ఫ్యాన్స్ కి ఊహించని షాక్!

Publish Date:Jan 5, 2026

  బాలకృష్ణ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ హిస్టారికల్ ఫిల్మ్ ని పక్కన పెట్టారా? NBK 111 కొత్త స్టోరీ ఏంటి? నయనతార ప్లేస్ లో ఎవరు?   'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), గోపీచంద్ మలినేని మరో ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపిన విషయం తెలిసిందే. బాలకృష్ణ కెరీర్ లో 111వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. ఈ హిస్టారికల్ ఫిల్మ్ లో నయనతార హీరోయిన్. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. (NBK 111)   బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో హిస్టారికల్ ఫిల్మ్ అనగానే.. అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమాని వెండితెరపై చూస్తామా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ కి షాకిచ్చేలా.. ఈ మూవీ స్టోరీ ఛేంజ్ అయినట్లు సమాచారం.   ప్రస్తుతం పెద్ద సినిమాల పరిస్థితి పెద్దగా బాలేదు. ఓటీటీ బిజినెస్ కూడా మునుపటిలా జరగడంలేదు. ఈ పరిస్థితులలో హిస్టారికల్ ఫిల్మ్ అయితే భారీ బడ్జెట్ అవుతుందనే ఉద్దేశంతో.. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ ని పక్కన పెట్టాలని టీమ్ నిర్ణయించిందట. దాని స్థానంలో మరో కొత్త స్క్రిప్ట్ తో సినిమా చేయబోతున్నారట. ఈ స్క్రిప్ట్ ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా ఉంటుందని, మలినేని ఈసారి అందరినీ సర్ ప్రైజ్ చేయడం ఖాయమని అంటున్నారు.   Also Read: రాశి సంచలన వీడియోతో చిక్కుల్లో అనసూయ.. క్షమాపణలు చెబుతుందా?   అలాగే 'NBK111' హీరోయిన్ కూడా మారనున్నట్లు వినికిడి. హిస్టారికల్ ఫిల్మ్ అనుకున్నప్పుడు హీరోయిన్ గా నయనతారను ప్రకటించారు. ఆమె రెమ్యూనరేషన్ రూ.10 కోట్లకు పైగా ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్ ని కంట్రోల్ చేయడం కోసం ఆమెకు బదులుగా మరో హీరోయిన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట.   'NBK111' గురించి వినిపిస్తున్న వార్తల్లో నిజానిజాలు ఎంతో తెలియదు కానీ.. ఇటీవల కాలంలో బడ్జెట్ లు పెరిగిపోయి నష్టపోతున్నామంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బడ్జెట్ విషయంలో ముందే జాగ్రత్తలు తీసుకోవడం అనేది అభినందించదగ్గ విషయమే.  

Tiger Shroff to be part of Allu Arjun and Atlee film?

Publish Date:Jan 6, 2026

Allu Arjun has delivered a massive blockbuster with Pushpa 2 The Rule and his market in North India is huge. Taking that into consideration, Sun Pictures have accepted to give Atlee, a free hand to make his sci-fi fantasy drama on a never-seen-before scale with Hollywood VFX Studios, Action Co-ordinators collaborating on it.  Now, the reports suggest that the movie could be spilt into two parts and both will be shot at one go. The movie team won't be going back to shoot the second part but rather they would be spending 6-8 months on VFX and scale of the second part, if the reports are true.  Currently, the reports suggest that Tiger Shroff is in talks and he even joined the film for a crucial part. Will he be playing an antagonist or supporting protagonist is yet to be known. Vijay Sethupathi is said to be a part of the film. Already, Deepika Padukone is part of the film and she completed two schedules.  Mrunal Thakur and Janhvi Kapoor are said to be part of the project as there will be a triple role for Allu Arjun with connection between past lives and future. We have to wait and see, how many of these reports will emerge to be true. Atlee is currently working on meeting a Hollywood Studio to distribute the film, state reports.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

దండోరా

Publish Date:Dec 31, 1969

The Raja Saab

Publish Date:Dec 31, 1969

Psych Siddhartha

Publish Date:Dec 31, 1969

Shambhala

Publish Date:Dec 31, 1969