English | Telugu

TFJA ఆధ్వర్యంలో తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఏర్పాటు

ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక మార్పులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో పత్రికా రంగంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. ప్రధాన మీడియాతోపాటు డిజిటిల్ మీడియా కీలక పాత్రను పోషిస్తోంది. అయితే వేగంగా మార్పులు జరుగుతున్న కారణంగా జవాబుదారీతనం లోపిస్తున్నదనే విమర్శలు, వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వార్తల ప్రసారం, ప్రచురణ విషయంలో జవాబుదారీతనం ఉండేలా.. కొన్ని ప్రతికూల అంశాలను కంట్రోల్ చేసేందుకు, టార్గెట్ ఆడియెన్స్‌కు వాస్తవాలను చేరవేసేందుకు తెలుగు సినీ, మీడియా రంగానికి సంధాన కర్తగా వ్యవహరించే విధంగా తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ (Telugu Film Digital Media Association) ఆవిర్భవించింది.