English | Telugu

సెన్సేష‌న‌ల్ యాక్ట్రెస్‌ దివ్య‌భార‌తి మృతి ఇప్పటికీ మిస్టరీనే!

దివ్య ఓంప్ర‌కాశ్ భార‌తి అంటే ఎవ‌రా అని ఆలోచన‌లో ప‌డొచ్చు. అదే.. దివ్య‌భార‌తి అంటే ఠ‌క్కున మ‌న‌కు ‘బొబ్బిలి రాజా’, ‘అసెంబ్లీ రౌడీ’ హీరోయిన్ గుర్తుకొచ్చేస్తుంది. కేవ‌లం మూడంటే మూడు సంవ‌త్స‌రాల కెరీర్‌లో సౌత్‌, నార్త్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అగ్ర తార‌గా రాణించి, జూనియ‌ర్ శ్రీ‌దేవిగా గుర్తింపు పొంది, పందొమ్మిది సంవ‌త్స‌రాల వ‌య‌సుకే.. త‌ను నివాసం ఉండే అపార్ట్‌మెంట్ 5వ ఫ్లోర్ ఫ్లాట్ నుంచి కింద‌ప‌డిపోయి ఆక‌స్మికంగా అసువులు బాసి, దేశాన్నంతా బిగ్ షాక్‌కు గురి చేసింది దివ్య‌భార‌తి. ఆ వార్త‌తో ఎంత‌మంది కుర్ర‌కారు గుండెలు బ‌ద్ద‌ల‌య్యాయో!