పేర్నినానిపై మరో కేసు?.. ముందస్తు బెయిలొచ్చే వరకూ అజ్ణాతమేనా బాసూ!
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని తాజాగా మరో భూ కబ్జా ఆరోపణ బలంగా వినిపిస్తోంది. బందరులోని రంగనాయకులు ఆలయ భూమికి సంబంధించి పేర్ని నానిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బైపాస్ రోడ్డు సమీపంలోని దేవుని చెరువు వద్ద భూమికి ఎండోమెంట్ అధికారులు గతంలో నిర్వహించిన వేలం ద్వారా చాలా చాలా తక్కువ ధరకు భూములు అమ్ముడుపోయాయి.