English | Telugu
తిరుమల పింక్ డైమండ్ వివాదానికి దర్యాప్తు నివేదిక ఫుల్ స్టాప్ పెట్టేసింది. మునిరత్నం రెడ్డి నేతృత్వంలో ఆర్కియిలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ విషయంలో అసలు పింక్ డైమెండే లేదని విస్పష్టంగా తేల్చేసింది.
ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ తాను సాధించిన అతి గొప్ప విజయంగా 17 కాలేజీలు నిర్మించానని తన భుజాలు తానే చరిచేసుకుంటూ ఉంటారు. ఆయన పార్టీకి కూడా చెప్పుకునేందుకు ఇది తప్ప మరొకటి కనిపించని పరిస్థితి ఉంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అజ్ణానానికి, అవగాహనా రాహిత్యానికీ నిలువెత్తు సాక్ష్యం ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలేనని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు.
నేపాల్లో 12 ప్రాంతాల్లో 217 మంది ఏపీ పర్యాటకులు చిక్కుకున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. వీరంతా 12 ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించామని లోకేశ్ పేర్కొన్నారు.
బీజేపీలో కమిటీల కలహం మొదలైంది. రాష్ట్రానికి కొత్త అధక్షుడొచ్చాడన్న కొత్త ఆశే లేకుండా పోయింది. పాత కొత్తల మేలు కలయికగా ఉండాల్సిన పార్టీ జట్టు కూర్పు కాస్తా ఏకపక్షం అయిపోయింది.
తాత్కాలిక ప్రధానమంత్రిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీని ఆందోళనకారులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు వెనుక కొందరు ఉండి బీజేపీని నడిపిస్తున్నారని తెలిపారు.
పేదవాడి ఆకలి తీర్చాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పెట్టామని సీఎం చంద్రబాబు అన్నారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) చేపట్టనున్నట్లు గతంలోనే ప్రకటించిన ఎన్నికల సంఘం.. తాజాగా ఈ విషయంపై రాష్ట్రాల ఎన్నికల సంఘం అధికారులతో బుధవారం కీలక సమావేశం నిర్వహించింది.
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తొలగిపోనున్నాయా? ట్రంప్ టారీఫ్ వార్ నుంచి వెనక్కు తగ్గనున్నారా? ఇరు దేశాల మధ్యా వాణిజ్య సంబంధాలు మళ్లీ పూర్వ స్థితికి చేరుకోనున్నాయా? అంటీ పరిశీలకులు ఔననే అంటున్నారు.
అనూహ్యం కాదు. అద్భుతం కాదు. అనుకున్నదే జరిగింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, అధికార ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ఎన్డీయే అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్’ భారత 15 ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిపై బీఆర్ఎస్ కసరత్తు ముగిసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మాగంటి గోపానాథ్ మరణంతో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోను ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిస్మిస్ చేసింది.
ప్రపంచంలో ఏ మూల ఏ సంక్షోభం తలెత్తినా.. అక్కడున్న తెలుగువారి క్షేమం కోసం ముందుగా కదిలేది ఒక్క తెలుగుదేశం మాత్రమే అన్న విషయం గతంలో పలుమార్లు రుజువైంది.
అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండో సారి.. గతంలో 2017 మే 6 నుంచి 2020 అక్టోబర్ 4 వరకూ టీటీడీ ఈవోగా పని చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా రెండో సారి అవకాశం దక్కించుకున్న తొలి వ్యక్తి అనిల్ కుమార్ సింఘాల్.