'దేవర'లో మరో తెలుగు హీరో.. ఎవరో తెలుసా?
'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'దేవర'. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీలో ఓ హీరో స్పెషల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.