Read more!

English | Telugu

షూటింగ్ నుంచి వెళ్ళిపోయిన మహేష్ బాబు.. తారాస్థాయికి 'గుంటూరు కారం' గొడవలు!

ఏ ముహూర్తాన గుంటూరు కారం సినిమా ప్రారంభమైందో కానీ.. మొదటి నుంచి అన్నీ అడ్డంకులే. షూటింగ్ మొదలవ్వడానికి ఎక్కువ సమయమే పట్టింది. మొదలయ్యాక షూటింగ్ సాఫీగా సాగకుండా పలుసార్లు బ్రేక్ లు పడ్డాయి. ఎట్టకేలకు షూటింగ్ చివరి దశకు చేరుకుంది, త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది అనుకుంటే.. ఇప్పుడు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.

'గుంటూరు కారం'కి సంగీతం దర్శకుడిగా తమన్ ని ఎంపిక చేయడంపై మొదటి నుంచి మహేష్ అసంతృప్తిగా ఉన్నాడు. అయితే 'అల వైకుంఠపురములో' సక్సెస్ సెంటిమెంట్ తో పట్టుబట్టి మరీ తమన్ ని తీసుకున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. ఈ నిర్ణయాన్ని మహేష్ ఫ్యాన్స్ కూడా ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. అయితే ఫస్ట్ సాంగ్ 'ధమ్ మసాలా' ఆకట్టుకోవడంతో అందరూ కూల్ అయ్యారు. కానీ రెండో సాంగ్ 'ఓ మై బేబీ' దారుణంగా నిరాశపరచడంతో ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. మ్యూజిక్, లిరిక్స్ బాలేవంటూ సోషల్ మీడియా రచ్చ చేశారు. అయితే వారిని మరో మంచి సాంగ్ తో కూల్ చేయాల్సింది పోయి.. మూవీ టీం ఫ్యాన్స్ ని మరింత హర్ట్ చేసింది. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి అభిమానులను పరోక్షంగా కుక్కలు అంటూ విరుచుకుపడ్డారు. ఇక నిర్మాత నాగవంశీ అయితే ఫ్యాన్స్ ని తిడుతున్నట్టుగా, బూతు అర్థం వచ్చేలా ఉన్న 'యానిమల్' మూవీలోని చివరి షాట్ క్లిప్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 

సాంగ్ విషయంలో తన ఫ్యాన్స్ పట్ల మూవీ టీం వ్యవహరించిన తీరుపై మహేష్ తీవ్ర అసహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మూవీ టీం అందరికీ క్లాస్ పీకాడట. అంతేకాదు ఇంకా షూటింగ్ పెండింగ్ ఉన్న మాస్ సాంగ్ పట్ల కూడా మహేష్ అసంతృప్తిగా ఉన్నాడట. ఈ సాంగ్ పై రీవర్క్ చేయాలని ఆయన సూచించాడట. కానీ దర్శకనిర్మాతల నుంచి సరైన సమాధానం లేకపోవడంతో హర్ట్ అయిన మహేష్.. గుంటూరు కారం సెట్స్ నుంచి కోపంగా వెళ్లిపోయినట్లు సమాచారం. అయినప్పటికీ దర్శకనిర్మాతలు మహేష్ విషయంలో కూడా ఫ్యాన్స్ తో వ్యవహరించినట్లుగానే.. మొండిగా వ్యవహరిస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్. సాంగ్ పై మళ్ళీ వర్క్ చేసి.. సెట్స్ నుంచి వెళ్ళిపోయిన మహేష్ ని మెప్పించి, కూల్ చేయాల్సింది పోయి.. అసలు ఆ మాస్ సాంగ్ లేకుండానే సినిమా రిలీజ్ చేస్తాం అంటున్నారట. దర్శకనిర్మాతలు ఇలాగే వ్యవహరిస్తే.. మహేష్ కనీసం మూవీ ప్రమోషన్స్ కి కూడా వచ్చే పరిస్థితి ఉండదని సన్నిహితుల నుంచి వినిపిస్తున్నమాట.