English | Telugu
కర్నాటక పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, సీఎం మార్పు తదితర అంశాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ హైకమాండ్ త్వరలో ఈ విషయంపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనుంది. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చెప్పారు.
రాష్ట్ర విభజన జరిగాక, తొలి ఐదేళ్లలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు కార్యాలయ విభాగాల తరలింపు జరిగినా, తదుపరి ఐదేళ్లు పాలించిన వైసీపీ ప్రభుత్వం దీని నిర్మాణం జోలికి పోలేదు. పైగా విధ్వంసకర నిర్ణయాలు, రాజకీయ విద్వేషాలతోనే అభివృద్ధిని సర్వనాశనం చేసింది.
తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీకి బీటీమ్ అని ఎప్పటి నుంచో ఉన్న అనుమానాలకు బలం చేకూర్చేవిగానే ఆమె వ్యాఖ్యలు విమర్శలు ఉంటున్నాయి. అదే సమయంలో ఆమె తన రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ కు చేరువ అవుతున్నారా అన్న అనుమానాలూ కలిగించేలా ఉంటున్నాయి.
జగన్ విపక్ష హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ లను బతిమలాడుకుంటున్నట్లుగా ఓ ఏఐ జనరేటెడ్ వీడియో ప్రస్తుతం సామిజిక మాధ్యమాన్ని షేక్ చేసేస్తోంది.
ఈ మాక్ అసెంబ్లీలో ప్రొటెమ్ స్పీకర్, స్పీకర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలుగా పిల్లలు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆ కారణంగానే జరుగుతున్నది నిజంగా అసెంబ్లీ సెషనేనా అనిపించింది.
ఆయన చెబుతోన్నది హైందవ కథలా లేక మరొకటా అన్నది పక్కన పెట్టి.. వినడానికి ఇంపుగా ఉండటం, మానవీయ విలువల ఔన్నత్యాన్ని చాటడం వల్లనే ఆయన ప్రవచనాలంటే ఎవరైనా సరే చెవులు కోసుకునే పరిస్థితి ఉంది.
మంత్రి కోమటిరెడ్డి వ్యవహారశైలిపై జిల్లా కాంగ్రెస్ లోని బీసీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే ఓర్వలేకపోతున్నారని మండిపడుతున్నాయి.
నోటిఫికేషన్ విడుదలైనందున ఎన్నికల నియమావళి తక్షణమే అమల్లోకి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతామని తెలిపారు.
ఈ అదృశ్య శక్తులు ఎవరు? ఎక్కడ నుంచి వస్తున్నారు? అన్న విషయం మాత్రం అంతుబట్టడం లేదని చెప్పారు. బీహార్ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత తొలి సారిగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీ ఇంతటి ఘోర ఓటమి పొందడం ఒక మిస్టరీగా ఉందన్నారు.
అరాచకపాలనకు తోడు జనానికి దూరంగా ఉండటం కూడా వైసీపీ గత ఎన్నికలలో ఘోర పరాజయం పాలు కావడానికి ప్రధాన కారణంగా మారింది. అయితే అందుకు భిన్నంగా ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సర్కార్ ప్రజల ప్రభుత్వంగా గుర్తింపు పొందుతోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా మూడు సార్ల విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిన మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ నాలుగో సారి కూడా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. అయితే గత 15 ఏళ్లుగా అధికారంలో ఉండటంతో ఈ సారి మమతా బెనర్జీ, ఆమె పార్టీ పట్ల ప్రజలలో ఒకింత వ్యతిరేకత కనిపిస్తోంది.
ఇంతకీ ఆయన ఇప్పుడు ఈ కామెంట్లు చేయడానికి ఆయన బీజేపీలో చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంలో సోషల్ మీడియాలో ఆయన లక్ష్యంగా పెద్ద ఎత్తున నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు.
డీసీసీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సగానికి పైగా కేటాయించింది.
2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ కు సహాయం చేయడానికి నాగార్జున సాగర్ జలాల వివాదాన్ని తెరపైకి తెచ్చి ఆయనకు అనుకూలంగా ఆ రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు జగన్ తన శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. అదేమీ ఫలించ లేదనుకోండి అది వేరే సంగతి.
ప్రజాపాలన విజయోత్సవాలు వచ్చే నెల 1 నుంచి 9వ తేదీ వరకూ రాష్ట్రప్రభుత్వం ఘనంగా, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుంది. అవి కాగానే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా సర్పంచ్ లు, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల విధి విధానాలను ఖరారు చేసింది.