పెద్దిరెడ్డి కుటుంబం పై ఫిర్యాదు.. దర్యాప్తు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు అరాచకాలు ఒక్కొక్కటీ బయట పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలతో ప్రజల్లో ధైర్యం కలిగింది. తమకు న్యాయం జరుగుతుందన్న భరోసాతో ముందుకు వచ్చి పెద్దిరెడ్డి, ఆయన కుటుంబీకుల అరాచకాలు, అన్యాయాలు, దౌర్జన్యాలపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ కోవలోనే పెద్దిరెడ్డి కుటుంబంపై పోలీసులకు తాజాగా మరో ఫిర్యాదు అందింది.