English | Telugu

ఈడి విచారణలో విజయ్ దేవరకొండ ఏం చెప్పబోతున్నాడు: బషీర్ బాగ్  

'విజయ్ దేవరకొండ'(Vijay Deverakonda)ప్రస్తుతం తన కొత్త మూవీ 'కింగ్డమ్'(KIngdom)తో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 'కింగ్డమ్' లోని విజయ్ నటనకి ప్రేక్షకుల నుంచి మంచి పేరు వస్తుంది. చిత్ర బృందం కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తమ సినిమా ఘన విజయం సాధించిందని చెప్తున్నారు.

విజయ్ గతంలో ఆన్ లైన్ వేదికగా కొన్నిబెట్టింగ్ యాప్ లకి ప్రమోటర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. చట్ట విరుద్ధమైన యాప్ లకి ప్రమోషన్, మనీ లాండరింగ్ కోణం దృష్ట్యా,కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని '"ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్"(ఈడి) విజయ్ కి ఇప్పటికే నోటీసులు జారీచేసింది. ఈ నేపథ్యంలో విజయ్ నేడు హైదరాబాద్ పరిదిలో బషీరాబాగ్ లో ఉన్న ఈడి(Ed)కార్యాలయానికి విచారణకి హాజరు కానున్నాడు. దీంతో విచారణలో విజయ్ ఏం చెప్తాడనే ఆసక్తి ఏర్పడింది. ఈ కేసులో ఇప్పటికే ప్రకాష్ రాజ్ ని విచారించగా, త్వరలోనే మరికొంత మందిని కూడా విచారించనున్నారు.

విజయ్ కొత్త సినిమాల విషయానికి వస్తే దిల్ రాజు బ్యానర్ లో రవికిరణ్ కోలా దర్శకత్వంలో మూవీతో పాటు, టాక్సీవాలా ఫేమ్ 'రాహుల్ సంకృత్యన్ 'దర్శకత్వంలో మైత్రి సంస్థ నిర్మిస్తున్న పీరియాడిక్ చిత్రాలు విజయ్ లిస్ట్ లో ఉన్నాయి.



అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.