English | Telugu

వార్-2 వర్సెస్ కూలీ.. వెయ్యి కోట్ల బొమ్మ ఏది..?

ఆగస్టు 14న 'వార్-2', 'కూలీ' అనే రెండు భారీ సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ రెండు చిత్రాలపైనా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. పాజిటివ్ టాక్ వస్తే.. రూ.1000 కోట్ల గ్రాస్ రాబట్టగల సత్తా ఈ రెండు సినిమాలకు ఉంది. అయితే రెండింట్లో దేనికి ఎక్కువ హైప్ ఉందనేది పక్కన పెడితే.. రూ.1000 కోట్ల గ్రాస్ కొల్లగొట్టే అవకాశాలు మాత్రం.. 'కూలీ' కంటే 'వార్-2'కే ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రూ.1000 కోట్ల గ్రాస్ రాబట్టాలంటే.. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఓవర్సీస్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా మంచి వసూళ్ళు రాబట్టాలి. అన్ని ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ వసూళ్ళు రాబట్టలేకపోతే.. వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడం అంత తేలికైన విషయం కాదు. అదే ఇప్పుడు 'కూలీ' సినిమా వెయ్యి కోట్ల ఆశలపై నీళ్లు చల్లుతోంది.

'వార్-2' అనేది బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ 'యశ్ రాజ్ ఫిలిమ్స్' నుంచి వస్తున్న మూవీ. కాబట్టి నార్త్ లోని మెజారిటీ థియేటర్లను 'వార్-2' ఆక్రమిస్తుంది అనడంలో సందేహం లేదు. హిందీ బెల్ట్ లో 'కూలీ'కి చాలా తక్కువ సంఖ్యలోనే థియేటర్లు దొరుకుతాయి. పైగా బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2' ఉంది కాబట్టి.. హిందీ ప్రేక్షకులు 'కూలీ'పై పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. అదే జరిగితే హిందీ నుంచి కూలీకి కనీస వసూళ్ళు కూడా రావు. ఈ లెక్కన నార్త్ లో పూర్తి ఆధిపత్యం 'వార్-2'దే ఉంటుందని చెప్పవచ్చు.

సౌత్ లో మాత్రం ఏ సినిమాది పూర్తిస్థాయి ఆధిపత్యం ఉండకపోవచ్చు. తమిళ్ లో 'కూలీ' డామినేషన్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో 'కూలీ' మంచి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ.. జూనియర్ ఎన్టీఆర్ నటించడంతో వసూళ్ల పరంగా 'వార్-2' టాప్ లో ఉంటుంది అనడంలో డౌట్ లేదు. కర్ణాటకలోనూ ఎన్టీఆర్ ఫ్యాక్టర్ 'వార్-2' సినిమాకి కలిసి రానుంది. కేరళలో మాత్రం 'కూలీ' పైచేయి సాధించే అవకాశముంది.

ఇక ఓవర్సీస్ విషయానికొస్తే.. అక్కడ కూడా 'వార్ వన్ సైడ్' ఉండకపోవచ్చు. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా 'కూలీ' డామినేషన్ కనిపిస్తోంది. కానీ, రిలీజ్ టైంకి లెక్కలు మారొచ్చు అంటున్నారు. హిందీ సినిమాలకు ఓవర్సీస్ లో పెద్దగా ప్రీమియర్ల హడావుడి కనిపించదు. అక్కడి హిందీ ప్రేక్షకులు శుక్రవారం నుంచి సినిమా చూడటం మొదలుపెడతారు. ఇప్పుడు 'వార్-2' విషయంలోనూ అదే జరగనుందనే అంచనాలు ఉన్నాయి. పైగా యశ్ రాజ్ ఫిలిమ్స్ కి ఓవర్సీస్ లోనూ స్క్రీన్స్ పరంగా మంచి పట్టుంది. దానికితోడు, ఎన్టీఆర్ కి కూడా ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది. ఎన్టీఆర్ నటించాడు కాబట్టి.. ఓవర్సీస్ లో 'వార్-2' తెలుగు వెర్షన్ కి మంచి వసూళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది.

మొత్తానికి నార్త్ ఇండియాలో 'వార్-2'ది పూర్తి హవా ఉండనుంది. సౌత్ ఇండియా, ఓవర్సీస్ లో మాత్రం.. 'వార్-2', 'కూలీ' పోటాపోటీగా తలపడనున్నాయి. హిందీ బెల్ట్ మద్దతు లేకుండా 'కూలీ' వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడం కష్టమే. ఆ పరంగా చూస్తే.. 'వార్-2'కి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సినిమాకి పాజిటివ్ రావడం మాత్రం ముఖ్యం. చూద్దాం మరి.. ట్రేడ్ అంచనాలు నిజమవుతాయో లేదో.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.