English | Telugu

బాక్సాఫీస్‌ షేక్ చేస్తోన్న విత్ లవ్.. కలెక్షన్స్ ఎంతో తెలుసా!


-విత్ లవ్ కి ఎందుకు అంత ఆదరణ
-కథ ఏంటి
-చూసిన వాళ్ళు ఏమంటున్నారు

కంటెంట్ ఉన్న సినిమాకి కట్ అవుట్ అక్కర్లేదనే నిజాన్ని గుర్తు చెయ్యడానికి అప్పుడప్పుడు కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. రావడమే కాదు సినీ వినీలాకాశంలో మెరవాలనే కోరిక ఉన్న ఎంతో మంది మేకర్స్ కి సంజీవిని లాగా తమ స్టేటస్ ని పెంచుకుంటాయి. అలాంటి ఒక చిత్రమే 'విత్ లవ్'(With LOve). తమిళంలో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 6 న తమిళంతో పాటు తెలుగులోను రిలీజ్ అయ్యి రోజు రోజు కి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. హీరో, హీరోయిన్ దగ్గరనుంచి మిగతా క్యారెక్టర్స్ పోషించిన ఎవరి ముఖాలు కూడా సరిగా తెలియదు. కానీ మంచి వసూళ్లతో దూసుకుపోతూ లాభాల బాటలో పయనిస్తోంది. మరి ఆ వివరాలు చూద్దాం.

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం మొదటి రోజు తమిళ, తెలుగు లాంగ్వేజస్ కలుపుకొని 1.6 కోట్ల రూపాయలు రాబట్టింది. కానీ శనివారం కలెక్షన్లు పెరిగి 2.5 కోట్లు వసూలు చేయగా మూడవ రోజైన ఆదివారం 3 కోట్లకి పైగా వసూలు చేసింది. దీంతో మూడు రోజుల వసూళ్లు 7.14 కోట్లకి చేరుకున్నాయి. నిర్మాణ సంస్థ అధికారకంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో ఓవర్సీస్ మార్కెట్‌ కలుపుకొని వరల్డ్ వైడ్ గా 11 కోట్లకి పైగా రాబట్టినట్టుగా చెప్పారు. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం తమిళనాడులోనే 6 కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్నట్టుగా తెలుస్తుంది. రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్, మగేష్ రాజ్ పసిలియన్ సంయుక్తంగా నిర్మించగా 4 కోట్ల రూపాయిల వరకు బడ్జెట్ అయినట్టుగా టాక్. మరి ఈ లెక్కన ఇప్పటికే లాభాల పట్టిన విత్ లవ్ ముందు ముందు ఈ మేర వసూళ్ళని అందుకుంటుందో చూడాలి.


Also read:ఆ మూవీలో చేసిన హీరో, హీరోయిన్ రియల్ గానే చనిపోయారు.. అభిమానుల కన్నీళ్లు

నూతన దర్శకుడు మధన్(Madhan)దర్శకత్వం వచించగా అభిషన్ జీవింత్, ఇటీవల రోషన్ హీరోగా వచ్చిన 'ఛాంపియన్' హీరోయిన్ అనస్వర రాజన్ జంటగా చేశారు. పెళ్లి చూపుల్లో పరిచయమైన సత్య సీలన్, మోనిషా అనే యువతీ యువకులకి ఆ ఇద్దరు ఒకే స్కూల్‌లో సీనియర్, జూనియర్స్ అని తెలుసుకుంటారు. ఆ విధంగా మొదలైన ఇద్దరి ప్రయాణంలో ఫస్ట్ లవ్, బ్రేకప్, గతాన్ని తలుచుకోవడం, వదిలేసిన జ్ఞాపకాలని మళ్ళీ స్పృశించడం అనే భావోద్వేగాల వైపు సాగుతూ ఒక కొత్త జోష్ ని అనుభూతిని విత్ లవ్ కలిగిస్తుంది.

Allu arjun: అల్లు అర్జున్ పై కావేరి కీలక వ్యాఖ్యలు.. నమ్మొచ్చా ఆ మాటలు 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)ప్రస్తుతం 'అట్లీ'(Atlee)దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సదరు చిత్రంలోని అల్లు అర్జున్ నట విన్యాసాన్ని చూడాలంటే  నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే. అల్లు అర్జున్ సినిమాల పరంగానే కాకుండా యాడ్స్ లోను తనదైన మెస్మరైజ్ ని చూపిస్తూ అభిమానులని, కస్టమర్స్ ని ఆకర్షిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ యాడ్స్ విషయంలో అల్లు అర్జున్ గురించి  రాయల్ ఎన్ ఫీల్డ్  బ్రాండ్ స్ట్రాటజీ విభాగం మేనేజర్ 'కావేరి బారువా'(kaveri Baruah) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి ఆమె ఏం మాట్లాడిందో చూద్దాం.