English | Telugu

spirit: స్పిరిట్ నుంచి తప్పుకోవడంపై ప్రకాష్ రాజ్ ట్వీట్..  అనుకున్నదే నిజమయ్యింది


-స్పిరిట్ లో తప్పుకున్నాడని కొన్ని రోజులుగా న్యూస్
-తన ట్వీట్ తో అసలు విషయం చెప్పేసిన ప్రకాష్ రాజ్
-ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఏమంటారు

యాక్టింగ్ పరంగా సౌత్ సినీ పరిశ్రమలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించే నటుల్లో ప్రకాష్ రాజ్(Prakash Raj)ఒకరు. 'ఓజి' లో సత్యదాదా క్యారక్టర్ ద్వారా ఆ విషయాన్ని మరోసారి గుర్తు చేసాడు. దీంతో ప్రభాస్(Prabhas),సందీప్ రెడ్డి(Sandeep Reddy Vanga)అప్ కమింగ్ మూవీ స్పిరిట్(Spirit)లో ప్రకాష్ రాజ్ క్యారక్టరైజేషన్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి అభిమానులతో పాటుప్రేక్షకుల్లో ఏర్పడింది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు.సెల్యులాయిడ్ పై సరికొత్త క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసే సందీప్ రెడ్డి వంగ తో ప్రకాష్ రాజ్ ఫస్ట్ టైం చేస్తుండటమే. కానీ కొన్ని రొజుల నుంచి సోషల్ మీడియా వేదికగా స్పిరిట్ నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకున్నాడని,ప్రభాస్, ప్రకాష్‌రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలని సందీప్ రెడ్డి తెరకెక్కించే తీరు ప్రకాష్ రాజ్ కి నచ్చటం లేదు. దీంతో గుడ్ బై చెప్పి వెళ్లిపోయాడనే న్యూస్ పట్టా పగ్గాల్లేకుండా సోషల్ మీడియా మార్కెట్ లో స్వతంత్ర హోదాలో తిరుగుతుంది.కానీ ప్రకాష్ రాజ్ తన ట్వీట్ తో సదరు హోదా డమ్మీ అంటు కళ్లెం వేసాడు.మరి ట్వీట్ లో ఏముందో చూద్దాం.


సినిమా స్ఫూర్తిపై విషపూరితమైన, నకిలీ వార్తలని ప్రచారం చేసే వారందరికీ చెప్తున్నాను. స్పిరిట్ లో నా సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభించలేదు. వాట్స్ అప్ ఫ్యాక్టరీలు కథలని ఊహిస్తారు. ఆ పని ఆపేసిపెద్దవారై జీవితాన్ని గడపండి అని తన స్టైల్లో ట్వీట్ చేసాడు. ఇప్పుడు ఈ ట్వీట్ రూమర్స్ ని సృషించే వాళ్ళకి కడుపుమంటగా మారింది. అభిమానులు. మూవీ లవర్స్ కి మాత్రం మహదానందంగా ఉండటంతో పాటు స్పిరిట్ ద్వారా మీ నట విశ్వరూపాన్ని మరోసారి ప్రదర్శించి ఆనందింప చెయ్యాలని కామెంట్స్ చేస్తున్నారు.


Also read:ప్రేమ అనేది శాపం.. అందుకేనా ఆ విధంగా చేస్తుంది

ఇప్పటికే రిలీజైన ‘స్పిరిట్’వాయిస్ టీజర్‌లో జైలు అధికారిగా ప్రకాష్‌రాజ్ చేస్తున్నాడనే విషయం తెలిసిందే. దీంతో ప్రకాష్ రాజ్ క్యారక్టర్ పై ఒక రేంజ్ లోనే అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకి మించి అలరించేలా చేసే ట్రాక్ రికార్డు ప్రకాష్ రాజ్ సొంతం.


Allu arjun: అల్లు అర్జున్ పై కావేరి కీలక వ్యాఖ్యలు.. నమ్మొచ్చా ఆ మాటలు 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)ప్రస్తుతం 'అట్లీ'(Atlee)దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సదరు చిత్రంలోని అల్లు అర్జున్ నట విన్యాసాన్ని చూడాలంటే  నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే. అల్లు అర్జున్ సినిమాల పరంగానే కాకుండా యాడ్స్ లోను తనదైన మెస్మరైజ్ ని చూపిస్తూ అభిమానులని, కస్టమర్స్ ని ఆకర్షిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ యాడ్స్ విషయంలో అల్లు అర్జున్ గురించి  రాయల్ ఎన్ ఫీల్డ్  బ్రాండ్ స్ట్రాటజీ విభాగం మేనేజర్ 'కావేరి బారువా'(kaveri Baruah) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి ఆమె ఏం మాట్లాడిందో చూద్దాం.