English | Telugu

కావేరి కామెంట్స్ పై అల్లు అర్జున్ టీమ్ కీలక ప్రకటన!

ప్రముఖ బ్రాండ్ స్ట్రాటజర్ కావేరి బారువా (Kaveri Baruah) రీసెంట్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి కారణం.. ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)పై కామెంట్స్ చేయడమే.

అల్లు అర్జున్ మేనేజర్స్ కఠినంగా ఉంటారని, ఆయనతో యాడ్ షూటింగ్ టైంలో ఏకంగా 42 నిబంధనలు పెట్టారని కావేరి తెలిపింది. కళ్ళలోకి చూడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఫోన్ మాట్లాడకూడదు అంటూ ఎన్నో రూల్స్ ఉన్నాయని చెప్పుకొచ్చింది.

కావేరి బారువా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అల్లు అర్జున్ దగ్గర ఇన్ని రూల్స్ ఉంటాయా? కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వనివ్వరా? కళ్ళలోకి చూడనివ్వరా? అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ క్రమంలో అల్లు అర్జున్ టీమ్ కీలక ప్రకటన చేసింది. కావేరి బారువా వ్యాఖ్యలను ఖండించింది. "అల్లు అర్జున్ గారిపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాము. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం." అని టీమ్ పేర్కొంది.

Also Read: త్రివిక్రమ్, అనిల్ రావిపూడి.. నెక్స్ట్ అనుదీప్!

Allu arjun: అల్లు అర్జున్ పై కావేరి కీలక వ్యాఖ్యలు.. నమ్మొచ్చా ఆ మాటలు 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)ప్రస్తుతం 'అట్లీ'(Atlee)దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సదరు చిత్రంలోని అల్లు అర్జున్ నట విన్యాసాన్ని చూడాలంటే  నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే. అల్లు అర్జున్ సినిమాల పరంగానే కాకుండా యాడ్స్ లోను తనదైన మెస్మరైజ్ ని చూపిస్తూ అభిమానులని, కస్టమర్స్ ని ఆకర్షిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ యాడ్స్ విషయంలో అల్లు అర్జున్ గురించి  రాయల్ ఎన్ ఫీల్డ్  బ్రాండ్ స్ట్రాటజీ విభాగం మేనేజర్ 'కావేరి బారువా'(kaveri Baruah) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి ఆమె ఏం మాట్లాడిందో చూద్దాం.