English | Telugu

త్రివిక్రమ్, అనిల్ రావిపూడి.. నెక్స్ట్ అనుదీప్!

'జాతిరత్నాలు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కె.వి. అనుదీప్ (Anudeep KV).. ఆ తర్వాత 'ప్రిన్స్'తో నిరాశపరిచాడు. ఇప్పుడు ఈ ఫిబ్రవరి 13న 'ఫంకీ'(Funky) ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే దీని తర్వాత అనుదీప్ మూవీ ఏంటనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో తాజాగా తన తదుపరి సినిమాలపై క్లారిటీ ఇచ్చాడు అనుదీప్.

'ఫంకీ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన అనుదీప్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లపై స్పందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఈ మూడు బ్యానర్ల నుంచి అడ్వాన్స్ తీసుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ కథ రాయడంతో పాటు, వెంకటేష్ కోసం కూడా ఒక కథ సిద్ధం చేస్తున్నట్లు చెప్పాడు.

వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47' సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక అనుదీప్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది. ఈ లోపు ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేసే ఆలోచనలో అనుదీప్ ఉన్నాడు.

Also Read: బోయపాటి నెక్స్ట్ మూవీ.. అల్లు అర్జున్ డేట్స్ ఇచ్చాడా?

Allu arjun: అల్లు అర్జున్ పై కావేరి కీలక వ్యాఖ్యలు.. నమ్మొచ్చా ఆ మాటలు 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)ప్రస్తుతం 'అట్లీ'(Atlee)దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సదరు చిత్రంలోని అల్లు అర్జున్ నట విన్యాసాన్ని చూడాలంటే  నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే. అల్లు అర్జున్ సినిమాల పరంగానే కాకుండా యాడ్స్ లోను తనదైన మెస్మరైజ్ ని చూపిస్తూ అభిమానులని, కస్టమర్స్ ని ఆకర్షిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ యాడ్స్ విషయంలో అల్లు అర్జున్ గురించి  రాయల్ ఎన్ ఫీల్డ్  బ్రాండ్ స్ట్రాటజీ విభాగం మేనేజర్ 'కావేరి బారువా'(kaveri Baruah) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి ఆమె ఏం మాట్లాడిందో చూద్దాం.