English | Telugu
'విరూపాక్ష'కు రెండో రోజు షాకింగ్ కలెక్షన్స్!
Updated : Apr 23, 2023
'విరూపాక్ష'తో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు వర్షం కురిపిస్తున్నాడు. మొదటిరోజు అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టిన విరూపాక్ష.. రెండోరోజు అంతకుమించిన కలెక్షన్స్ తో సత్తా చాటింది. విరూపాక్ష జోరు చూస్తుంటే తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించేలా ఉంది.
'విరూపాక్ష' రూ.22 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసిందని తెలిసి.. మీడియం రేంజ్ హీరో నటించిన ఓ హారర్ థ్రిల్లర్ సినిమాకి అంతా బిజినెస్సా? అసలు బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? అని పలువురు అభిప్రాయపడ్డారు. కానీ మొదటిరోజే వరల్డ్ వైడ్ గా రూ.6.35 కోట్ల షేర్ తో జోరు చూపించింది. రెండో రోజు అయితే ఏకంగా రూ.7.30 కోట్ల షేర్ తో ఆశ్చర్యపరిచింది. దీంతో రెండు రోజుల్లోనే రూ.13.65 కోట్ల షేర్ సాధించింది. ఇక మూడో రోజు ఆదివారం కావడంతో మరో రూ.6-7 కోట్ల రేంజ్ షేర్ రాబట్టి.. రూ.20 కోట్ల షేర్ క్లబ్ లో చేరే అవకాశముంది.
రెండు రోజుల్లో నైజాంలో రూ.4.53 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.1.43 కోట్లషేర్, ఆంధ్రాలో రూ.4.63 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన విరూపాక్ష.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఇప్పటిదాకా రూ.10.59 కోట్ల షేర్ సాధించింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.85 లక్షలషేర్, ఓవర్సీస్ లో రూ.2.21 కోట్ల షేర్ కలిపి.. రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.13.65 కోట్ల షేర్ వసూలు చేసింది. రూ.23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ ఐదు రోజుల్లోనే లాభాల్లోకి ఎంటర్ అయ్యేలా ఉంది.