English | Telugu
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సూపర్ స్టార్!
Updated : Apr 23, 2023
లెజెండరీ నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు ఈ నెల 28న ఘనంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 28న విజయవాడలోని పోరంకిలో జరగనున్న ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, నటసింహం నందమూరి బాలకృష్ణతో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ వేదిక పంచుకోనున్నారు.
ఎన్టీఆర్ శత జయంతి వేడుకల కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రజినీకాంత్, బాలకృష్ణ, చంద్రబాబు లను ఒకే వేదికపై చూడటం కోసం ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబంతో రజినీకాంత్ మొదటి నుంచి సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల చంద్రబాబును కూడా కలిశారు. ఇప్పుడు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ వేడుకల్లో పాల్గొంటూ ఎన్టీఆర్‌పై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఈ మెగా ఈవెంట్ కోసం నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.