English | Telugu
మళ్ళీ వాయిదా పడిన విక్రమసింహ
Updated : May 8, 2014
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా రజినీకాంత్ "విక్రమసింహ" ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుందని ప్రచారం చేసారు. కానీ ఈ చిత్రాన్ని మళ్ళీ వాయిదా వేసారు. ఈ చిత్రాన్ని మే23 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా 2డి, 3డి లలో తెరకెక్కింది. వీటికి సంబంధించిన ప్రింట్లు ఇంకా సిద్ధం కాకపోవడం వల్లనే చిత్ర విడుదల ఆలస్యం అవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. కానీ ఈ చిత్ర పంపిణీ విషయంలో నిర్మాతలకు, పంపిణీ దారులకు మధ్య సమస్య ఏర్పడిందని సమాచారం. ఏదేమైనా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో రజిని కాంత్ సరసన దీపిక పదుకునే, శోభన వంటి తారలు నటించారు. రజినీకాంత్ కూతురు సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.