English | Telugu
తమన్నాకి బాగా సమర్పించుకున్న నాన్ బెండ
Updated : May 8, 2014
తెలుగు, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న మిల్క్ బ్యూటీ తమన్నాకు తమిళంలో రెండు రోజుల బేరం దొరికిందట. తమిళంలో ఉధయనిధి మారన్ హీరోగా నటిస్తున్న "నాన్ బెండ" చిత్రంలోని ఓ సినిమా హీరోయిన్ పాత్ర ఉందట. ఈ పాత్ర కోసం తమన్నాను సంప్రదిస్తే వెంటనే ఒప్పుకుందట. ఇందులో తమన్నా కేవలం రెండు రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొనాలి. కేవలం ఈ రెండు రోజులకోసమే తమన్నా 20 లక్షలు డిమాండ్ చేసిందట. తమన్నా అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఆ చిత్ర నిర్మాత కూడా వెంటనే ఒప్పెసుకున్నాడట.
అసలే తమిళంలో సినిమాలు లేక ఉన్న ఈ అమ్మడికి ఇంత రెమ్యునరేషన్ అవసరమా అంటూ కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మార్కెట్ పడిపోయిన ఈ అమ్మడికి మనమే కావాలని మార్కెట్ పెంచేలా ఉన్నామని కోలీవుడ్ దర్శక నిర్మాతలు భాదపడుతున్నారు. ఈ సినిమాలో తమన్నా నటనకు మంచి మార్కులు పడితే ఇక రెమ్యునరేషన్ విషయంలో రాజీ పడే అవకాశాలేమి కనిపించట్లేదని కోలీవుడ్ వర్గాల అంచనా.