English | Telugu
ప్రభాస్ తెలుగు హీరో కాదంటున్న విక్రమ్..ఆశ్చర్యపోతున్న హీరోయిన్
Updated : Aug 28, 2024
మా రెబల్ స్టార్ ప్రభాస్(prabhas)రేంజ్ ని ఎవరు అందుకోలేరని ఫ్యాన్స్ చెప్తే పెద్దగా కిక్ ఉండదు. అదే ఇంకో స్టార్ హీరో చెప్తే. ఆ కిక్కే వేరు కదా! ఇప్పుడు ప్రభాస్ అభిమానులు ఆ కిక్ లోనే తేలియాడుతున్నారు. అసలు విషయం ఏంటో చూసేద్దాం.
చియాన్ విక్రమ్(vikram)ఎంత గొప్ప నటుడో చెప్పాల్సిన పని లేదు.క్యారక్టర్ కోసం స్టార్స్ కూడా ఎంత కష్టమైనా పడతారనటానికి విక్రమ్ నే ఒక ఉదాహరణ. అదర్ హీరోలకి మించి కష్టపడతాడని కూడా చెప్పుకోవచ్చు. రీసెంట్ గా వచ్చిన తంగలాన్ నే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. ఇక విక్రమ్ లేటెస్ట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందులో ప్రభాస్ గురించి కొన్ని గూస్ బంప్ వ్యాఖ్యలు చేసాడు. ప్రభాస్ ని తెలుగు హీరో అనడం సరి కాదు. ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పుకొచ్చాడు. ఈ మాటలు ప్రభాస్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తున్నాయి. అంతే కాదు ప్రభాస్, విక్రమ్ కాంబో లో సినిమా పడితే ఒక రేంజ్ లో ఉంటుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ కూడా చేస్తున్నారు.
ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మాళవిక మోహన్(malavika mohanan)మాట్లాడుతు ప్రభాస్ తో కలిసి నటించే అవకాశం రావడం చాలా అదృష్టం. భాష పరంగా సినిమాకి ఉన్న సరిహద్దుల్నిప్రభాస్ తొలగించాడు. ఆయన నటించిన సినిమాపై ప్రేక్షకులు చూపించే అభిమానం చూస్తే ఆశ్చర్యం కూడా వేస్తుందని చెప్పింది. రాజా సాబ్(raja saab)లో మాళవిక ఒక హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే.ఇక విక్రమ్ నెక్స్ట్ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ప్రస్తుతం తంగలాన్ థియేటర్స్ లో సందడి చేస్తుంది.