English | Telugu

Veeranjaneyulu vihara yatra OTT : ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న వీరాంజనేయులు విహార యాత్ర!

అనురాగ్ పాలుట్ల దర్శకత్వం వహించిన 'వీరాంజనేయులు విహార యాత్ర(Veeranjaneyulu vihara Yatra )' అగస్ట్ 14 న ఈటివీ విన్ లో‌ రిలీజైంది. ఈ సిరీస్ మధ్యతరగతి కుటుంబం యొక్క కష్టాలు మరియు వారి అవసరాలను తీర్చుకోవడానికి ఎలా కష్టపడుతున్నారో హైలైట్ చేసింది.

కథ కొత్తదేమీ కాదు మరియు చాలా సినిమాలు, వెబ్‌సిరీస్ మరియు సీరియల్‌లలో దుమ్ము రేపింది. అయితే అనురాగ్ పలుట్ల నవ్వించే టచ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన 90's వెబ్ సిరీస్ తర్వాత మళ్ళీ అలాంటి కథ ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూసేవారికి ఈ వీరాంజనేయులు విహార యాత్ర మూవీ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఈ కథంతా కుటుంబం చుట్టూనే తిరుగుతుంది. ఓ మిడిల్ క్లాస్ కుటుంబంలో వచ్చే ప్రాబ్లమ్స్ వాటిని ఎదుర్కోవడానికి ఆ ఇంటి పెద్ద ఏం చేశాడనేదే కథ. అడల్ట్ సీన్లు లేకుండా, బూతులు మాట్లాడకుండా కుటుంబంతో కలిసి చూసేలా కథ సాగుతుంది. ఈ కథలో గోవాకి వెళ్దామని ఫ్యామిలీతో కలిసి నాగేశ్వరరావు అనుకున్నంత వరకు సాఫీగా సాగుతుంది . అయితే ఆ ట్రిప్ లో అతడకి ఎదురైన సవాళ్ళేంటి? అసలు కూతురు పెళ్ళి చేయగలిగాడా లేదా అనేది మిగతా కథ.

తాజాగా ఈ సిరీస్ ఈటీవీ విన్ లో అత్యధిక వీక్షకాధరణని సొంతం చేసుకుంది. 100+ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని ఈ సిరీస్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈటీవీ విన్ ఓటీటీ అభిమానులకి థాంక్స్ చెప్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ' తెలుగులో మొట్టమొదటి ఫ్యామిలీ రోడ్ ట్రిప్ సినిమా' అంటూ చెప్పుకొచ్చింది. మరి ఈ సిరీస్‌ ని మీరు‌ చూసేయ్యండి.